Swetha
కొత్త కొత్తవి సృష్టించాలంటే భారతీయుల తర్వాతే ఎవరైనా. నిత్యం ఏవో ఒక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో కూడా ఇలాంటి ఓ మ్యాజిక్ నే కనబరిచాడు ఓ యువకుడు.
కొత్త కొత్తవి సృష్టించాలంటే భారతీయుల తర్వాతే ఎవరైనా. నిత్యం ఏవో ఒక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో కూడా ఇలాంటి ఓ మ్యాజిక్ నే కనబరిచాడు ఓ యువకుడు.
Swetha
సోషల్ మీడియా మన అరచేతుల్లోకి వచ్చిన తర్వాత .. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో కళ్లముందు కనిపిస్తుంది. ఆ వీడియో లేదా ఫోటో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే .. అది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పైగా సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వాలి అనుకునే వారైతే నిత్యం ఏదో ఒకటి కొత్తగా చేస్తూ.. వాటిని పోస్ట్ చేస్తూ లైకులు సంపాదించుకుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అగ్గిపెట్టె కానీ, లైటర్ కానీ లేకుండా గ్యాస్ స్టవ్ వెలగడం ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన చేతి వేలితోనే గ్యాస్ స్టవ్ ను వెలిగించాడు. దీంతో ఈ మ్యాజిక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఆ వీడియోలో ఒక వ్యక్తి స్టవ్ కి దగ్గరగా కుర్చీపై కూర్చోని ఉన్నాడు.. తన చేతి వేలిని గ్యాస్ స్టౌవ్ పై పెట్టాడు.. ఈలోపు మరో వ్యక్తి అక్కడకు వచ్చి..కుర్చీలో కూర్చున్న అతని తలపై టవల్ లాంటిది కప్పి, వేగంగా లాగేశాడు.. ఈ క్రమంలో యువకుడు స్టవ్ బర్నర్ పై చేయి పెట్టినప్పుడు, బర్నర్ నుంచి మంటలు వచ్చాయి. చేతిలో అగ్గిపెట్టె కానీ, లైటర్ కానీ లేకుండా స్టవ్ ని ఎలా వెలిగించాడని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనికి కారణం స్టాటిక్ ఎనర్జీ. స్టాటిక్ ఎనర్జీని జనరేట్ చేయడం ద్వారా ఆ వ్యక్తి చేతి నుంచి మంటలు వచ్చాయి. ఇది ఒక ఆబ్జెక్ట్ లోపల కానీ దాని పైన కానీ ఎలక్ట్రిక్ ఛార్జీలకు అసమతుల్యంగా సూచిస్తుంది. ఈ స్టాటిక్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. చలికాలంలో చాలా మందికి ఏదైనా వస్తువును ముట్టుకున్నపుడు షాక్ కొడుతూ ఉంటుంది. దానికి ఈ స్టాటిక్ ఎనర్జీనే కారణం. నేలతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి తలపై దుప్పటిని లాగినప్పుడు, ఒంట్లో ఉన్న స్టాటిక్ ఎనర్జీ వేలి ద్వారా విడుదలై.. గ్యాస్ స్టవ్‌ను వెలిగించేంత స్పార్క్ ను విడుదల చేస్తుంది. ఈ వ్యక్తి వీడియో వైరల్ అవ్వడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇది.
ఇక వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన తర్వాత.. కొన్ని వేల లైకులు, కామెంట్లు సంపాదించుకుంది. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోగా.. మరి కొంతమంది గ్యాస్ వంటి పేలుడు పదార్దాలతో.. ఎవరు ఈ వీడియోలోని ప్రయోగాన్ని చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. ఇలాంటి ప్రయోగాత్మక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇలాంటి సాహసాలు ఎవరు చేయకపోవడం మంచిది. మరి, ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Guy igniting gas stove by generating static energy 😳
Truly, India is not for beginners 🥵 pic.twitter.com/4eFVFF0esx— Godman Chikna (@Madan_Chikna) January 11, 2024