A Thursday Report : ఏ తర్స్ డే రిపోర్ట్

తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ఏ తర్స్ డే. డిస్నీ హాట్ స్టార్ లో ఇవాళ నుంచి అందుబాటులోకి వచ్చింది. ట్రైలర్ ఆసక్తి రేపడంతో దీని మీద అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. థియేటర్ కంటే ఓటిటిలో ఇలాంటి వాటికి మంచి స్పందన ఉండటంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ త్వరలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ ఆడియో జోడిస్తారు. బెహజాద్ కంబటా దర్శకత్వం వహించిన ఈ హోస్టేజ్ థ్రిల్లర్ లో డింపుల్ కపాడియా లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్లు భాగమయ్యారు. ఎలా ఉందో రిపోర్ట్ చూద్దాం.

ఇంట్లోనే ప్లే స్కూల్ నడిపే నైనా(యామీ గౌతమ్) 16 పిల్లలను బందీలుగా ఉంచుకుని పోలీసులకు తన డిమాండ్లు చెబుతుంది. దీన్ని డీల్ చేస్తున్న ఇన్స్ పెక్టర్ జావేద్ ఖాన్(అతుల్ కులకర్ణి), అతని పై అధికారి అల్వరెజ్(నేహా ధూపియా)లు కలిసి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చేసిన పొరపాటు వల్ల ఓ పిల్లాడి ప్రాణం పోతుంది. 5 కోట్లు తన అకౌంట్ కు వేయించుకుంటుంది నేహా. అంతేకాదు ప్రధాన మంత్రి (డింపుల్ కపాడియా) తనతో మాట్లాడాలని అడుగుతుంది. అసాధ్యమైనా సరే అది నెరవేరుస్తారు. అసలు నేహా ఇంతటి దుర్మార్గానికి తెగబడేందుకు కారణం ఏమిటి, ఫ్లాష్ బ్యాక్ గట్రా తదితర వ్యవహారాలు సినిమాలోనే చూడాలి.

కాన్సెప్ట్ పాతదే అనిపించినా బెహజాద్ డీల్ చేసిన విధానం బాగుంది. ఏం జరగబోతోందో కొంతవరకు ఊహించేలా కథాకథనాలు సాగాయి కానీ ప్రొడక్షన్ వేల్యూస్ తో పాటు రిచ్ క్యాస్టింగ్ ఏ తర్స్ డేని మరీ బోర్ కొట్టకుండా నడిపించింది. కాకపోతే నైనా గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్ లో పాయింట్ మంచిదే అయినప్పటికీ అది ప్రెజెంట్ చేసిన తీరు మరీ గొప్పగా లేదు. రెండు గంటల పది నిమిషాల నిడివి మరీ ల్యాగ్ అనిపించకపోవడం ఈ సినిమాకున్న పెద్ద ప్లస్ పాయింట్. రోషన్ – కైజాద్ ల సంగీతం, రాకేష్ – సిద్దార్థ్ ల ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగాయి. మొత్తానికి ఏ తర్స్ డే మరీ నిరాశపరచకుండా వన్ టైం వాచ్ క్యాటగిరీలో సాగిందనే చెప్పాలి

Also Read : Roshan & Sree Leela : 20 కోట్ల బడ్జెట్ తో కుర్రజంట సినిమా ?

Show comments