దీపావళికి 5 బాక్సాఫీస్ పటాసులు

వచ్చే వారం రాబోయే దీపావళికి బాక్సాఫీస్ పటాసులు గట్టిగానే ఉండబోతున్నాయి. కౌంట్ తో పాటు కంటెంట్ ఉన్నవి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మూడు రోజుల ముందు 21నే సందడి చేయడానికి నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు. అందులో మొదటిది ‘ఓరి దేవుడా’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ మీద మొదట్లో పెద్దగా బజ్ లేదు కానీ విక్టరీ వెంకటేష్ క్యామియో కన్ఫర్మ్ అయ్యాక ఆటోమేటిక్ గా హైప్ వచ్చేసింది. ఈ పాత్రే ఇప్పుడీ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చేలా ఉంది. తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే రీమేక్ ఇది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేయగా కన్నడలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పోషించారు.

రెండోది మంచు విష్ణు ‘జిన్నా’. హిట్టు కన్నా ఎక్కువ ట్రోలింగ్ కు గురవుతున్న విష్ణు దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సూర్య దర్శకత్వంలో కోనవెంకట్ నిర్మాణ కం రచన పర్యవేక్షణలో మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ గ్లామర్ ని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమ్ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రమోషన్లు చేస్తోంది. ఈ రెండు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ అదే డేట్ కి వస్తోంది. ద్విభాషా చిత్రం అన్నారు కానీ లిప్ సింక్ గట్రా చూస్తుంటే డబ్బింగ్ ఏమోననే అనుమానం కలుగుతుంది.జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి.

నాలుగోది కార్తీ ‘సర్దార్’. కమల్ హాసన్, విక్రమ్ తరహాలో ఇందులో కార్తీ చాలా రకాల వేషాలు గెటప్పులు వేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో రాశిఖన్నా హీరోయిన్ కాగా చాలా గ్యాప్ తర్వాత నిన్నటి తరం అందాల భామ లైలా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇంటర్వ్యూలు వగైరా ఆల్రెడీ జరిగిపోతున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ ఒక రోజు ముందే 20న స్పెషల్ ప్రీమియర్లతో బరిలో దించుతున్నారు. మొత్తం చూసుకుంటే తెలుగు తమిళ ఇంగ్లీష్ క్రేజీ సినిమాలతో దివాలి హంగామా మాములుగా ఉండేలా లేదు. గాడ్ ఫాదర్ నెమ్మదించాక చెప్పుకోదగ్గ జోష్ లేకపోవడంతో ట్రేడ్ ఆశలన్నీ పండగ మీదే ఉన్నాయి. చూడాలి ఎవరు విన్నర్ అవుతారో

Show comments