వాల్తేరు వీరయ్య @ 2 మిలియన్ క్లబ్

మెగాస్టార్ స్టామినా మరోసారి యుఎస్ లో ఋజువయ్యింది. కేవలం వారం రోజులు గడవకుండానే సగర్వంగా 2 మిలియన్ క్లబ్ లోకి వాల్తేరు వీరయ్య అడుగు పెట్టింది. ఇంత తక్కువ గ్యాప్ లో ఈ బెంచ్ మార్క్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ మొదటి రోజు డివైడ్ టాక్ ని తట్టుకుని మరీ ఇంత వసూలు చేయడం మెగా ఫాన్స్ కి మాములు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా చిరంజీవి మూడు సార్లు ఈ ఫీట్ సాధించారు. ఖైదీ నెంబర్ 150 కంబ్యాక్ తో పాటు సైరా నరసింహారెడ్డి సైతం టూ మిలియన్ దాటేశాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఇంకా లాంగ్ రన్ చాలా ఉండగానే రికార్డును నమోదు చేయడంతో ఫైనల్ ఫిగర్ షాకింగ్ గా ఉండనుంది

తెలుగు రాష్ట్రాల్లో దూకుడు అలాగే కొనసాగుతోంది. నూటా యాభై కోట్ల గ్రాస్ దాటేసిందని ట్రేడ్ టాక్ ఉంది కానీ మైత్రి సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సెకండ్ వీక్ రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి ఫిగర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడం వాల్తేరు వీరయ్యకు మరింత కలిసి రానుంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఊచకోత మాములుగా లేదు. మొన్న మండపేటలో అర్ధరాత్రి పన్నెండు తర్వాత స్పెషల్ షోస్ వేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏరియాల వారీగా కూడా రికార్డులు నమోదవుతున్నాయి. చిరు హయ్యెస్ట్ బెస్ట్ గా ఇది నిలవబోతుండటం లాంఛనమే

మరోవైపు వీరసింహారెడ్డి డీసెంట్ గానే రాబడుతున్నప్పటికీ వీరయ్యతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. ఒక మిలియన్ తర్వాత పూర్తిగా నెమ్మదించిపోయింది. బ్రేక్ ఈవెన్ పరంగా ఓవరాల్ బిజినెస్ కోణంలో నష్టాలు లేవు కానీ అభిమానులు ఆశించిన రేంజ్ లో విజేత కాలేకపోయింది. మరోవైపు కొన్ని కేంద్రాల్లో వారసుడు, కళ్యాణం కమనీయం, తెగింపులకు థియేటర్లు ఇవ్వడం వల్ల పండగ సెలవులు మూడు రోజులు చిరు బాలయ్యలు కొంత రెవిన్యూని నష్టపోవాల్సి వచ్చింది. ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం ఉన్నా సరే వాల్తేరు వీరయ్య ప్రభంజనం జోరుగానే ఉంది. ఇదంతా రాబోయే భోళా శంకర్ కు చాలా పెద్ద ప్లస్ గా మారడం మాత్రం ఖాయం

Show comments