Krishna Kowshik
రైల్వే ప్రయాణాలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. టూర్స్ ఎంజాయ్ చేయాలన్నా, ప్రకృతి అందాలను పరవశించాలన్నా కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లే ట్రైన్ జర్నీయే కరెక్ట్. ఎంతో ఆహ్లాదంగా సాగిపోయే ప్రయాణంలో కొన్ని దృశ్యాలు కనిపిస్తూ.. సందేహాలను కలగజేస్తుంటాయి.
రైల్వే ప్రయాణాలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. టూర్స్ ఎంజాయ్ చేయాలన్నా, ప్రకృతి అందాలను పరవశించాలన్నా కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లే ట్రైన్ జర్నీయే కరెక్ట్. ఎంతో ఆహ్లాదంగా సాగిపోయే ప్రయాణంలో కొన్ని దృశ్యాలు కనిపిస్తూ.. సందేహాలను కలగజేస్తుంటాయి.
Krishna Kowshik
దూరాభారాలు వెళ్లాలంటే చాలా మంది ప్రిఫర్ చేసే ఏకైక మార్గం రైలు. రిజర్వేషన్ షురూ చేసుకుంటే చాలు.. సౌకర్యవంతం, ఆహ్లాదకరంగా సాగిపోతుంది రైలు జర్నీ. అలా రైలులో వెళుతున్న ప్రతిసారి.. ఒక పట్టాల మీద నుండి మరో పట్టాలపైకి ట్రైన్ పరుగులు పెడుతుంటే భలే సరదాగా ఉంటుంది. అలాగే కిటికీలో నుండి బయట ప్రపంచాన్ని చూస్తే మైమరిచిపోతూనే.. కొన్ని ఆసక్తికర సంఘటనలు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలా డౌట్సే ఉంటాయి కానీ.. ఎవరినీ అడగాలో.. ఎలా తెలుసుకోవాలో తెలియక మిన్నకుండిపోతుంటారు. అటువంటి డౌటానుమానంలో ఇది కూడా ఒకటి. ఇంతకు అదేటంటే..?
రైలులో మనం వెళుతుంటే.. ట్రాక్ వెంబడి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఆ బోర్డులు కొన్ని సింబల్స్ చూపిస్తుంటాయి. డబ్ల్యు/ఎల్ (W/L) లేదా W/B లేదా హిందీలో C/Fa అని రాసి ఉంటాయి. ఆ సైన్ బోర్డులు ట్రాకుకు ఇరువైపులా కనిపిస్తూ మనల్ని సందేహంలోకి నెడుతుంటాయి. అవి ఎందుకు పెట్టారంటే.. లోకో పైలట్ల కోసం. లోకో పైలట్లకు సూచనలు ఇస్తూ ఇవి అక్కడ పొందు పరిచారు. ఇక్కడ డబ్ల్యు అంటే విజిల్ అని అర్థం. ఎల్ అంటే లెవెల్ క్రాసింగ్. ఈ సూచన వచ్చినప్పుడల్లా అక్కడ మానవ రహిత లెవల్ క్రాసింగ్ ఉందని, హారన్ కొట్టమని అర్ధాన్ని ఈ సింబల్, లేదా లెటర్స్ సూచిస్తాయి. హిందీలో అక్షరాలు కూడా వీటినే సూచిస్తుంటాయి.
ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఇలా చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ. లెవల్ క్రాసింగ్ కు 250 మీటర్ల దూరంలో సైన్ బోర్డులు ఉంచుతారు. ఈ బోర్డును చూడగానే.. విజిల్ అంటే హారన్ కొట్టి ఓ సిగ్నల్ ఇస్తారు లోకో పైలట్లు. అలాగే W/B అంటే అక్కడ డబ్ల్యు హారన్‌ను సూచించినట్లే.. బి అనేది వంతెనను సూచిస్తుంది. లోకో పైలట్ ఆ సైన్ బోర్డును చూడగానే ముందు వంతెన ఉంటుందని గ్రహించి.. హారన్ కొడుతూ ఉంటారు. బ్రిడ్జి దాటే సమయంలో హారన్ వేస్తూ వెళుతుంటారు. ఈ బోర్డులు పసుపు రంగులో ఉండి దూరం నుండి కూడా కనబడేలా అక్షరాలు రాసి ఉంటాయి. కొంత దూరం నుండే వీటిని లోకో పైలట్స్ చూడటంతో.. ఆ ప్రాంతానికి రాగానే హారన్ మోగిస్తారు. ఇది అనమాట.. ఈ బోర్డు, ఆ సైన్ల వెనుక ఉన్న కథా కమామీషు.