P Krishna
Union Minister Hardeep Singh Puri Clarity: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గ్యాస్ వినియోగించడం సర్వ సాధారణం అయ్యింది. ఇటీవల గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
Union Minister Hardeep Singh Puri Clarity: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గ్యాస్ వినియోగించడం సర్వ సాధారణం అయ్యింది. ఇటీవల గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
P Krishna
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో మంచి కన్నా చెడు అంశాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. దీంతో సామాన్యులు ఏం జరుగుతుంతో అని తలలు పట్టుకుంటారు. అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. గ్యాస్ వినియోదారులు ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టాలంటూ కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదేశించాయి. ఈ క్రమంలోనే గ్యాస్ ఏజెన్సీలు ఈకేవైసీ వెంటనే నమోదు చేసుకోవాలని ఆంక్షలు విధిస్తున్నాయి. ఈకేవైసీ తేది త్వరలో ముగిసిపోతుందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి ఒక్కరూ గ్యాస్ వినియోగం కామన్ అయ్యింది. ఇటీవల గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదేశించిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈకేవైసీ నమోదు చేసుకుంటున్నారు. అయితే ఈ నమోదు సమయంలో ఎక్కువగా లేదని త్వరలో గడువు ముగిసిపోతుందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో గ్యాస్ వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల్లో ఈకేవైసీ నమోదు చేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. తాజాగా ఈ వార్తలపై కేరళ శాసన సభ ప్రతిపక్ష నేతల వీడి సతీశన్.. కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు.
ప్రతిపక్ష నేత లేఖపై కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. ‘బోగస్ కస్టమర్లను తొలగించేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు ఈకేవైసీ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ చేపట్టాయి.. గత 8 నెలలు గా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో కస్టమర్ల వివరాలను వెరిఫై చేస్తారు. వారి మొబైల్ ఫోన్లలోని యాప్ తో వినియోగదారులు ఆధార వివరాలను నమోదు చేసుకొని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఒకవైళ కస్టమర్లకు దగ్గరలో డిస్ట్రీబ్యూటర్లు ఉంటే అక్కడ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకొచ్చు. దీంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల యాప్ లను ఇన్ స్టాల్ చేసుకొని సొంతంగా ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చమురు సంస్థలు గానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి తుది గడువు విధించలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.