Delhi:ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు.. 10 బోగీలు బోల్తా!

దేశంలో ఎక్కడ చూసిన రైలు ప్రమాదలేవి అడుగడుగుకి జరుగుతునే ఉన్నాయి. తాజాగా మరోసారి ఢిల్లీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

దేశంలో ఎక్కడ చూసిన రైలు ప్రమాదలేవి అడుగడుగుకి జరుగుతునే ఉన్నాయి. తాజాగా మరోసారి ఢిల్లీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన రైలు ప్రమాదలేవి అడుగడుగుకి జరుగుతునే ఉన్నాయి. ఇటీవలే ఒడిశ్స బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘెర రైలు ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. కానీ, ఈ ఘటన మరువక ముందే మరోసారి విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలకు గల కారణం సిగ్నెల్స్ సాంకేతిక లోపమో లేక మానవ తప్పిదమే తెలియదు కానీ, చాలామంది ప్రాణలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇలా ఏదో ఒక రూపంలో రైలు ప్రమాదాలనేవి తరుచు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఢిల్లీలో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ దుర్ఘటన శనివారం ఉదయం 11 50 గంటల సమయంలో చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ప‌టేల్ న‌గ‌ర్‌-ద‌యాబ‌స్తీ సెక్షన్‌లో చారమండి జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో.. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 10 బోగీలు బోల్తాపడ్డాయి. దీంతో ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తక్షణమే అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన దృశ్యలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు. కాగా, ఆ రైలు పట్టాలు తప్పడం, ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి బోగీలు బోల్తాపడిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

అయితే ముంబై నుంచి చండీఘ‌డ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐర‌న్ షీట్ రోల్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడటంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, చనిపోయారా అనే విషయాలను రైల్వే అధికారులు ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఢిల్లీలో జరిగే గూడ్స్ రైలు ప్రమాదం పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments