బోర్డ్ ఎగ్జామ్స్ లో స్వయంగా ఆన్సర్స్ చెప్తున్న టీచర్స్! ఎక్కడంటే?

Teachers Caught Dictating Answers In Board Exams:ఏ స్టేట్ లో అయినా కానీ బోర్డ్ ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా.. దానికి తగిన చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైనా పిల్లలు కాపీ కొడుతుంటే.. టీచర్స్ వెంటనే పట్టుకుంటారు, కానీ రాజస్థాన్ లో ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Teachers Caught Dictating Answers In Board Exams:ఏ స్టేట్ లో అయినా కానీ బోర్డ్ ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా.. దానికి తగిన చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైనా పిల్లలు కాపీ కొడుతుంటే.. టీచర్స్ వెంటనే పట్టుకుంటారు, కానీ రాజస్థాన్ లో ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

విద్యార్థుల జీవితంలో బోర్డు ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు.. విద్యార్థుల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయని అంటూ ఉంటారు. ఇక ఏ స్టేట్ లో అయినా కానీ ఈ బోర్డు ఎగ్జామ్స్ అనేవి చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా మాస్ కాపీ జరగకుండా.. ఎక్కడిక్కడ కఠిన చర్యలు అమలు పరుస్తూ ఉంటారు. పరీక్షా హాల్ లో ఉండే ఇన్విజిలేటర్స్ మాత్రమే కాకుండా.. మధ్య మధ్య స్క్వాడ్స్ కూడా తిరుగుతూ చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కడైనా పిల్లలు కాపీ కొట్టినట్లు కనిపిస్తే మాత్రం వెంటనే దానిపై యాక్షన్ తీసుకుంటారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే కానీ.. రాజస్థాన్ లో జరిగిన ఈ సంఘటన గురించి వింటే మాత్రం అందరు నోటి మీద వేలు వేసుకోవాల్సిందే. అసలు ఏమైందో చూసేద్దాం.

ప్రస్తుతం రాజస్థాన్ లోని కొన్ని పాఠశాలలో 10, 12 తరగతుల వారికి రాజస్థాన్ స్టేట్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కొలు అనే గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఓ అనూహ్య ఘటనను వెలుగులోకి తీసుకుని వచ్చారు.. విజిలెన్స్ అధికారులు. సాధారణంగా ఇలాంటి పరీక్షలు జరుగుతున్నాయంటే.. ఎక్కడైనా కానీ ఆకస్మిక తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. అలాగే విజిలెన్స్ స్క్వాడ్ ఈ గ్రామానికి కూడా వెళ్లారు. కానీ అక్కడ మాత్రం స్కూల్ గేట్స్ కు తాళం వేసి ఉండడం చూసి.. వారికి అనుమానం కలిగింది. దీనితో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. డైరెక్ట్ గా క్లాస్ రూమ్స్ లోకి వెళ్లిపోయారు. తీరా వెళ్లి చూస్తే … అక్కడ టీచర్స్ ఏకంగా బ్లాక్ బోర్డు పైన పాఠాలు చెప్పినట్లుగా .. పరీక్ష పత్రంలోని ప్రశ్నలకు సమాధానాలు రాసేస్తున్నారు. దీనితో ఆ టీచర్లు ఆధారాలతో సహా విజిలెన్స్ స్క్వాడ్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పైగా వారు దానికి స్టూడెంట్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటున్నట్లుగా.. తెలియజేశారు అధికారులు.

ఈ క్రమంలోనే ఓ విద్యార్థి దగ్గర రూ.2,100, మరో విద్యార్థి దగ్గర రూ.2,000 లను కూడా గుర్తించారు. ఇక ఇక్కడ మరొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. సైన్స్ స్ట్రీమ్ కు చెందిన ఇద్దరు టీచర్స్.. ఇలా ఆన్సర్స్ చెప్పడమే కాకుండా.. ఏకంగా ఇతర విద్యార్థుల తరపున వారే ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని వెంటనే పోలీసులు దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఈ ఘటనపై రాజస్థాన్ విద్యాశాక స్పందించి.. ఆ స్కూల్ లోని టీచర్స్ పై కేసు నమోదు చేసి.. వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఏదేమైనా విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేదే సరైనది కాదని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments