ఛాలెంజ్ లో ఓటమి.. మంత్రి పదవికి నేత రాజీనామా!

ఛాలెంజ్ లో ఓటమి.. మంత్రి పదవికి నేత రాజీనామా!

ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై వివిధ అంశాలకు సంబంధించి సవాళ్లు విసురుతుంటారు. అయితే ఇలా ఛాలెంజ్ లు చేసుకునే నేతల్లో చాలా తక్కువ మంది మాత్రమే ...మాట మీద నిలబడతారు. అలా ఓ నేత మాత్రం మాట మీద నిలబడ్డారు.

ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై వివిధ అంశాలకు సంబంధించి సవాళ్లు విసురుతుంటారు. అయితే ఇలా ఛాలెంజ్ లు చేసుకునే నేతల్లో చాలా తక్కువ మంది మాత్రమే ...మాట మీద నిలబడతారు. అలా ఓ నేత మాత్రం మాట మీద నిలబడ్డారు.

రాజకీయల్లో నేతల మధ్య పరస్పరం సవాళ్లు అనేవి సహజం. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై వివిధ అంశాలకు సంబంధించి సవాళ్లు విసురుతుంటారు. అయితే ఇలా ఛాలెంజ్ లు చేసుకునే నేతల్లో చాలా తక్కువ మంది మాత్రమే …మాట మీద నిలబడతారు. ఇక వాళ్లు విసిరిన సవాళ్లలో ఓడిపోతే.. దానికి గురించి మర్చిపోతుంటారు. కానీ కొందరు నేతలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటారు. తాము చెప్పిన మాటను, చేసిన సవాళ్లను తప్పకుండా  పాటిస్తుంటారు. అలానే ఛాలెంజ్ లో ఓడిపోయిన ఓ బీజేపీ నేత ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి.. ఆయన ఎవరు, ఆయన చేసిన ఛాలెంజ్  ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

కొన్ని రోజుల క్రితం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసింది. అలానే రాజస్థాన్ లో కూడా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలో రాజస్థాన్ కి చెందిన బీజేపీ మంత్రి కిరోదిలాల్ మీనా.. ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఆయన  ఏ గడియల్లో సవాల్ చేశారో ఏమో కానీ. అందులో ఓడిపోయారు. అయితే రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు కామనేనని దాదాపు అందరూ లైట్ తీసుకుంటారు. కానీ ఈ బీజేపీ మంత్రి మాత్రం అలా తీసుకోలేకపోయారు. చెప్పినట్లు.. సవాల్ చేసినట్లు.. దానికి కట్టుబడి.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజస్థాన్ రాష్ట్ర మంత్రి కిరోదిలాల్ మీనా తూర్పు రాజస్థాన్‌లోని 7 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఇక ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన సవాల్ చేశారు. తాను ఇన్ ఛార్జీగా ఉన్న ప్రాంతాల్లో ఏ  ఒక్క స్థానంలోనైనా బీజేపీ ఓడిపోతే తాను రాజీనామా  చేస్తాన్నారు. ఈ ఏడు స్థానాల్లో దౌసా, కరౌలి-ధోల్‌పూర్, టోంక్-సవాయి మాధోపూర్, భరత్‌పూర్ స్థానాలతో కూడిన 4 స్థానాలను బీజేపీ ఓడిపోయింది. దీంతో తాను చేసిన ఛాలెంజ్ లో ఓటమి చెందడంతో తాను చెప్పినట్లుగానే మీనా తన మంత్రి పదవికి రిజైన్ చేశారు.

రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మకు తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ విషయాన్ని మంత్రి మీనా స్వయంగా ఓ టీవీ ఛానెల్‌ ద్వారా వెల్లడించారు. సీఎం భజన్ లాల్ శర్మ తనను రాజీనామా చేయవద్దని కోరారని, అయితే తాను అన్ని పదవులకు రాజీనామా చేశానని మీనా  పేర్కొన్నారు. నిజానికి, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.  ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వంలో వ్యవసాయ, గ్రామీణ మంత్రిగా కిరోదిలాల్ మీనా ఉన్నారు. మరి..మంత్రి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments