వీడియో: యూనీఫామ్‌లో పోలీసుల డ్యాన్స్.. తర్వాత ఏం జరిగిందంటే!

Viral Video: సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడూ కేసులు, దర్యాప్తులతో బిజీగా ఉంటారు. కానీ, నాగ్‌పూర్‌లో నలుగురు పోలీసు అధికారులు డ్యూటీలో ఉండగా యూనిఫాంలో డ్యాన్స్ చేశారు.. అదే వాళ్ల కొంప ముంచింది. వివరాలు ఇలా ఉన్నాయి..

Viral Video: సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడూ కేసులు, దర్యాప్తులతో బిజీగా ఉంటారు. కానీ, నాగ్‌పూర్‌లో నలుగురు పోలీసు అధికారులు డ్యూటీలో ఉండగా యూనిఫాంలో డ్యాన్స్ చేశారు.. అదే వాళ్ల కొంప ముంచింది. వివరాలు ఇలా ఉన్నాయి..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే..మరికొన్ని కన్నీరు తెప్పించేలా, ఆశ్చర్యపరిచే విధంగా ఉంటున్నాయి. ఈ మధ్య కొంతమంది రీల్స్, వీడియోస్ తో సోషల్ మీడియాలో పాపులర్ కావాలని నానా తంటాలు పడుతున్నారు. సామాన్య ప్రజల విషయం పక్కనబెడితే ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలో ఉండగా ఇలాంటి పనులు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పోలీస్ యూనిఫామ్ లో ఉండగా ఓ బాలీవుడ్ సాంగ్ కి డ్యాన్స్ చేసిన పోలీస్ అధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఉన్నతాధికారులు. వివరాల్లోకి వెళితే..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సాంగ్స్ పెట్టుకొని పోలీస్ అధికారులు ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేశారు. అప్పుడు వాళ్లకు తెలియాదు.. ఆ డ్యాన్స్ వాళ్ల కొంప ముంచుతుందని. పోలీసులు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో క్షణల్లో వైరల్ అయ్యింది. అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సదరు పోలీసులపై వేటు పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..నాగ్‌పూర్‌లోని గాంధీబాగ్ తహసీల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఎస్ఐ సంజయ్ పాటంకర్, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖయ్యూం గని, భాగ్యశ్రీ గిరి, కానిస్టేబుల్ నిర్మలా గావ్లీ లు ‘ఖైకే పాన్ బనారస్వాలా’ పాటపై డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అది కాస్త వీడియో తీసి సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది..క్షణాల్లో వైరల్ అయింది.

ఈ విషయంపై ఉన్నతాధికారులు సదరు పోలీస్ అధికారులపై సీరియస్ అయ్యారు. డ్యూటీలో ఉండి.. అదికూడా పంద్రాగస్టు రోజున ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటు అంటూ వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయం గురించి జోన్ – 3 ఇన్‌చార్జ్ డీసీపీ రాహూల్ మద్నే మాట్లాడుతూ.. ఒక బాధ్యాతాయుతమైన పోస్టు లో ఉండి.. యూనీఫామ్ లో ఇలాంటి పనులు చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు. వారికి వార్నింగ్ ఇస్తూ నలుగురు పోలీసులపై మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించామన్నారు రాహూల్ మద్నే. ప్రస్తుతం పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Show comments