ఢిల్లీలో కలకలం.. నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి..

Parliament Issue: ఎంతో పటిష్టమైన భద్రతా వలయంలో ఉండే పార్లమెంట్ పై గతంలో ఖలిస్తాన్ ఉగ్రమూక దాడికి పాల్పపడిన విషయం తెలిసిందే. గత ఏడాది కొంతమంది యువత గ్యాలరీలోకి దూరి హంగామా సృష్టించారు.

Parliament Issue: ఎంతో పటిష్టమైన భద్రతా వలయంలో ఉండే పార్లమెంట్ పై గతంలో ఖలిస్తాన్ ఉగ్రమూక దాడికి పాల్పపడిన విషయం తెలిసిందే. గత ఏడాది కొంతమంది యువత గ్యాలరీలోకి దూరి హంగామా సృష్టించారు.

పార్లమెంట్ భవనం చుట్టూ ఎంతో గట్టి బందోబస్తు ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఏ చిన్న అనుమానం ఉన్నా ఎంతీటి వారైనా భద్రతా సిబ్బంది ఆపేస్తుంటారు. ఇటీవల లోక్ సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగా ఇద్దరు యువకులు స్పీకర్ వెల్ లోకి దూరి.. అక్కడ ఉన్న గ్యాస్ సిలెండర్లను ఓపెన్ చేశారు. అనంతరం సభ్యులు కూర్చునే బేంచీలపై దూకి నానా రచ్చ చేశారు..దీంతో ఎంపీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మోహరించి వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పార్లమెంట్ వద్ద కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..

దేశాధినేతలు సమావేశం అయ్యే పార్లమెంట్ వద్దు ఎంతో ప్రతిష్టాత్మకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఇటీవల కొన్నిసార్లు భద్రత డొల్లతనం బయటపడుతుంది. తాజాగా ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ భవనంలోకి నకిలీ ఆధార్ కార్డులతో ప్రవేశించడానికి ప్రయత్నించగా వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వారి ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ముగ్గురు అగంతకులు ఫేక్ ఆధార్ కార్డు చూపించి హై – సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి గేట్ నంబర్ 3 ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిపై అనుమానం రావడంతో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నట్లు వెల్లడించారు.

ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు, ఎన్డీఏ ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతను మోడీ ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు. రాత్రి 7 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలువనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి ఎన్డీఏ ఎంపీలు సంతకాలతో కూడిన లేఖను ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డు చూపించి గేట్ నెంబర్ 3 ద్వారా పార్లమెంట్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు ఖాసిం, మోనిస్, షోయబ్ గా గుర్తించారు. వెంటనే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

Show comments