చదవడం, రాయడం రాదు.. కానీ పదిలో 99.5% మార్కులు..! ఎలా అంటే?

Karnataka Peon Issue: ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. దొంగదారిలో ఉద్యోగాలు పొందాలనుకునే వారి వీక్ నెస్ ని క్యాష్ గా మార్చుకుంటున్నారు.

Karnataka Peon Issue: ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. దొంగదారిలో ఉద్యోగాలు పొందాలనుకునే వారి వీక్ నెస్ ని క్యాష్ గా మార్చుకుంటున్నారు.

దేశంలో డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్న సంగతి తెలిసిందే. డబ్బుంటే కొండమీది కోతినైనా కొని తేవొచ్చు అంటారు పెద్దలు. ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం పలు అన్యాయాలకు.. అక్రమాలకు పాల్పపడుతున్నారు. దొంగతనాలు, హైటెక్ మోసాలు, వ్యభిచారం, డ్రగ్స్ దందా ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తు లక్షలు సంపాదిస్తున్నారు. కొంతమంది దొంగ సర్టిఫికెట్స్ తో కోట్లు దండుకుంటున్నారు. పది తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలా ఎలాంటి  సర్ఫిఫికెట్లు అయినా సరే అంగట్లో సరుకుల్లా దొరుకుతున్న విషయం తెలిసిందే. కొంతమంది దొంగ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు కూడా ఉన్నారు.  కర్ణాటకలో ఆసక్తికర సంఘటన చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కొప్పల్ కోర్టులో ప్యూన్ ప్రభు లక్ష్మీకాంత్ లొఖరే (23) కు పదిలో వచ్చిన మార్కులు చూసి జడ్జీ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు సదరు ప్యూన్ కి అస్సలు చదవడం రాదు, రాయడం రాదని తెలిసి జడ్జీ అవాక్కయ్యాడు. రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూర్ తాలూకాకు చెందిన ప్రభు కు పదవ తరగతిలో 99.5 శాతం మార్కులు వచ్చాయి. ఈ క్రమంలోనే 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం తుది మెరిట్ జాబితాలో ఏప్రిల్ 22, 2024న అతని పేరు రావడంతో ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న కొద్ది రోజులకే అయ్యవారి భాగోతం బయటపడింది.

కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం.. హ్యాపీగా ఉందని ఫిక్స్ అయిన ప్రభు కి జడ్జీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ప్రభు కి రాయడం, చదవడం రాదని తెలుసుకున్న జడ్జీ ఎలా రిక్యూట్‌మెంట్ అయ్యాడు.. అతని అర్హతలు ఏంటీ అన్న దానిపై విచారణ జరిపారు. అప్పుడు ప్రభు టెన్త్ సర్టిఫికెట్ చూసి షాక్ తిన్నాడు. అంతేకాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జడ్జీ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రభు ఏడో తరగతి తర్వాత నేరుగా పదో తరగతి పరీక్ష రాసి 625 మార్కులకు 623 మార్కులను సాధించినట్లు ఎప్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రభుకి కన్నడం చదవడం, రాయడం రాదు, ఇంగ్లీష్ కూడా పెద్దగా తెలియదు. దొంగ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారా? అనే దానిపై విచారణ జరపాలని న్యాయమూర్తి డిమాండ్ చేశారు. పోలీసులు ప్రభు ఎడ్యూకేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Show comments