P Krishna
Panipuri Shops are Closed: దేశంలో ఎన్నో రకాల స్ట్రీట్ వుడ్ లభిస్తుంది.. కానీ చాలా మంది పానీపూరి అంటే ఎంతో ఇష్టపడతారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం పానీ పూరి తినేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి పానీపూరి ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది.
Panipuri Shops are Closed: దేశంలో ఎన్నో రకాల స్ట్రీట్ వుడ్ లభిస్తుంది.. కానీ చాలా మంది పానీపూరి అంటే ఎంతో ఇష్టపడతారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం పానీ పూరి తినేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి పానీపూరి ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది.
P Krishna
భారత దేశంలో పానీపూరి గురించి తెలియని వారు ఉండరు. స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా అమ్ముడుపోయేది పానీపూరి అంటే అతిశయోక్తి లేదు. చిన్నా పెద్దా ప్రతి ఒక్కరూ పానీపూరి అంటే లొట్టలేసుకుంటూ తింటారు. పానీపూరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తుంటారు. గోల్ గప్ప, పానీపూరి, గప్ చుప్ అని రక రకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది పానీ పూరి వ్యాపారులు అపరిశుభ్ర ప్రదేశాల్లో అమ్మడం, కలుషితమైన రసం తయారు చేయడం వల్ల ఎంతోమంది అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. ఆరోగ్యానికి పానిపూరి హానికరమైనవని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఓ రాష్ట్రం పానీపూరిని పూర్తిగా బంద్ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అది ఏ రాష్ట్రం? పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో ఫుడ్ లవర్స్ పానీపూరి అంటే ఎంతో ఇష్టపడతారు. స్ట్రీట్ లో లభించే పానీపూరి తినేందుకు క్యూ కడుతుంటారు. అయితే పానిపూరిలో ఆరోగ్యానికి హానికరం అని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. కర్ణాటకలో దొరికిన పానీపూరిలో ఆరోగ్య ప్రమాణాలు సరిగా అధికారులు గమనించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర వ్యాప్తంగా పానీపూరీ నమూనాలను సేకరించగా అందులో 22 శాతం శాంపిల్స్ లో ఆరోగ్య ప్రమాణాలు పాటించలేదని తేల్చింది. 260 నమూనాల్లో 41 నమూనాల్లో కృత్రిమ రంగు, క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను గుర్తించారు. దాదాపు 18 శాంపిల్స్ వరకు మానవ వినియోగానికి పనికిరావని తేల్చింది. ఇదిలా ఉంటే తమిళనాడులో పానీపూరి లవర్స్ కి బ్యాడ్ న్యూస్. పానీపూరీ విషయంలో తమిళనాడు రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారుల సూచన, సమాచారం మేరకు చెన్నై వ్యాప్తంగా పానిపూరి షాపుల్లో ఫుడ్ సెఫ్టీ అధికారులు విసృత తనిఖీలు చేశారు. తమిళనాడులోనూ ఇదే రకమైన కారకాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పానిపూరి శాంపిల్స్ ల్యాబ్ కి పంపిన తర్వాత రిపోర్టు ఆధారంతా పానిపూరి పద్దతి ప్రకారం బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అత్యంత ప్రమాణాలతో తీయారు చేసే షాపుల్లో తినాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.