కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.. భారీగా పెరగబోతున్న ఉల్లి ధరలు!

Onion: ఉల్లి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కేజీ ఉల్లి ధర సెంచరీకి చేరువైంది. భవిష్యత్తులో ఉల్లి ధర భారీగా పెరగబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే?

Onion: ఉల్లి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కేజీ ఉల్లి ధర సెంచరీకి చేరువైంది. భవిష్యత్తులో ఉల్లి ధర భారీగా పెరగబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే?

నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయలు, పప్పుదినుసులు, వంట నూనెల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఉల్లిధరలు ఆకాశాన్నంటుతూ కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. మిగతా నిత్యవసర వస్తువులకంటే ఉల్లిధరలు అమాంతం పెరిగాయి. ఉల్లి లేని వంటిల్లును ఊహించలేము. ప్రతి వంటకంలో ఉల్లిని వాడుతుంటారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే ఉల్లికి వంటల్లో అంత ప్రాధాన్యత ఇస్తుంటారు. కాగా ఉల్లికొరత రైతులకు ఆనందం కలిగిస్తుండగా.. వినియోగదారులకు మాత్రం సమస్యగా మారింది.

పెరిగిన ధరలతో ఉల్లి రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి. ఉల్లిపంట చేతికొచ్చిన వారికి లాభదాయకంగా మారింది. కాగా డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడంతో ఉల్లిధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ వర్గాలు. గత కొన్ని రోజులుగా ఉల్లిధరు పైపైకి ఎగబాకుతున్నాయి. చికెన్ రేట్లతో పోటీపడుతున్నాయి ఉల్లిధరలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేజీ ఉల్లి ధర రూ. 100ను తాకుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. అయితే వాస్తవానికి సీజన్ ప్రకారం ఉల్లి ధరలు తగ్గాల్సి ఉండగా ధరలు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే గతంలో కురిసిన అకాల వర్షాలు.

వర్షాల ప్రభావం ఉల్లిపంటపై పడింది. అకాల వర్షాలతో ఉల్లి సాగు కుదేలైంది. పెద్ద మొత్తంలో ఉల్లిపంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉల్లిపంట దిగుబడి పడిపోయింది. దేశంలోనే ఉల్లి ఎక్కువగా సాగు చేసే రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ అక్టోబర్ లో భారీ వర్షాలు కురవడంతో ఉల్లిసాగు ఆలస్యమైంది. సరైన సమయంలో పంట సాగు చేయకపోవడంతో ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. వినియోగం ఎక్కువైపోయింది. దీంతో ఉల్లిధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి సరఫరా తగ్గుదల ఇలాగే కొనసాగితే కేజీ ఉల్లి ధర రూ. 100 దాటొచ్చని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉల్లి పంట సాగు లేటవుతుండడంతో పంట చేతికి వచ్చే సరికి ఆలస్యమవుతుంది. పంట నష్టం జరగడం వల్ల ఇప్పట్లో ఉల్లిపాయల కొరత తీరే అవకాశం లేదు. ఉల్లి భారీగా సప్లై అవ్వాలంటే.. మరో 100 రోజులు పడుతుంది.

అంటే.. జనవరి వరకూ ఉల్లి కొరత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉల్లి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. గతంలో ద్రవ్యోల్భనం, పంట ఉత్పత్తి కొరత కారణంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఉల్లి ధరలు భారీగా పెరగబోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మార్కెట్‌లో కృత్రిమ కొరత కూడా ఉల్లిపాయల ధర పెరగడానికి కారణం అవుతోంది. హోల్‌సేల్ వ్యాపారులు ఉల్లిని కొని స్టాక్ పెడుతున్నారు. రైతుల నుంచి సప్లై లేదు అంటున్నారు. దాంతో కృత్రిమ కొరత ఏర్పడి ధర పెరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు తక్కువ ధరలో ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఉల్లి ధరలు పెరగబోతున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments