iDreamPost
android-app
ios-app

ఢిల్లీకి పొంచి ఉన్న పెను ముుప్పు.. అదే గనుక జరిగితే..

ఢిల్లీకి పొంచి ఉన్న పెను ముుప్పు.. అదే గనుక జరిగితే..

దేశ రాజధాని ఢిల్లీ పెను ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ ఇప్పటికే ఛిన్నాభిన్నం అయింది. ఆయా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనం వానల కారణంగా అల్లాడిపోతున్నారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఢిల్లీకి భారీ వర్ష సూచన ఉంది. ఈ మేరకు వాతారణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దీంతో యమునా నది ఉధృతి మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక, యమునా నదిలో నీటి మట్టం ఉదయానికి 206.02 మీటర్లకు చేరుకుంది. సాధారణంగా 205.33 మీటర్లు దాటితే అది ప్రమాద స్థాయిలో ఉన్నట్లు.. అలాంటిది సాధారణం కంటే ఓ మీటరు ఎక్కువగానే యమునా నదిలో నీళ్లు ఉన్నాయి. అది అర్థరాత్రికి తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా వర్షాలు ఇలానే కురిస్తే నీటి మట్టం పెరిగి పెను ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు.

ఇక, ఢిల్లీ వర్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఫ్రాన్స్‌, యూఏఈ పర్యటనల తర్వాత ఢిల్లీకి చేరుకున్న ఆయన ఢిల్లీ గవర్నర్‌ వీకే సక్సేనాతో మాట్లాడారు. అక్కడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీలో ఇలాంటి వరదలు రావటం 45 ఏళ్లలో ఇదే మొదటి సారి. శుక్రవారం ఆగిపోయిన వర్షం.. శనివారం మళ్లీ మొదలైంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఢిల్లీ వరదలకు హర్యానా ప్రభుత్వమే కారణమని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.