PM Modi: దేశ ప్రజలకు మోదీ శుభవార్త.. ఐదేళ్ల పాటు అవన్నీ ఉచితం

మోడీ సర్కార్ దేశ ప్రజలకు మేలు చేసేలా.. ఇప్పటివరకు ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూ.. ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సభలో ప్రజలకు మరొక శుభవార్తను అందించారు మోడీ. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మోడీ సర్కార్ దేశ ప్రజలకు మేలు చేసేలా.. ఇప్పటివరకు ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూ.. ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సభలో ప్రజలకు మరొక శుభవార్తను అందించారు మోడీ. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం.. దేశ అభివృద్ధి కోసం ఎన్నో ఉన్నత నిర్ణయాలను తీసుకుంటూ.. దేశ అభివృద్ధి కోసం పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ప్రజలకు అండగా నిలుస్తూ.. ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ .. వారికి జీవనాధారాలు చూపించింది. అలాగే నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. వారికోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మోడీ సర్కార్ మరోసారి బీజేపీ మ్యానిఫెస్టోని విడుదల చేస్తూ.. దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే సభలో మోడీ ప్రసంగిస్తూ అనేక విషయాలను ప్రజలతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

తాజాగా జరిగిని ఒక సభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. ఈ విధంగా మాట్లాడారు. ” ఇవాళ ఎంతో మంచి రోజు. ఉత్తమ మేనిఫెస్టోని తయారు చేసిన రాజ్ నాథ్ సింగ్ ను అభినందిస్తున్నాను. అలాగే మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. గత పదేళ్లలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఈ పదేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల రూపకల్పన కూడా చేపట్టాం. ఇక ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ సంకల్ప లక్ష్యం.. యువత కోరికలను నెరవేరుస్తుంది. యువత, మహిళలు, పేద వర్గాలనే ప్రగతి దిశగా తీసుకుని వెళ్లడమే మా లక్ష్యం. అలాగే మరొక ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ ను అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోడీ ఇస్తున్న గ్యారెంటీ ” అంటూ నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ఈరోజున దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు కొత్త సంవత్సరం మొదలవుతుందని.. పైగా ఈరోజు అంబేద్కర్ జయంతి కూడా కలిసి వచ్చిన రోజున పవిత్రమైన ఈరోజునే.. బీజేపీ సంకల్ప పత్రాలను విడుదల చేసింది అంటూ మోడీ ప్రసంగించారు. సంకల్ప పత్రాల గురించి మాట్లాడుతూ.. ” దేశంలో ప్రజలందరికి బీజేపీ సంకల్ప పత్రం కోసం ఎంతో ఆసక్తి ఉంటుంది. మా మేనిఫెస్టోలో నాలుగు అంశాల పైన ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. యువశక్తి, నారి శక్తి, గరీబ్ యోజన, కిసాన్ యోజనపై యువ భారత్ , యువ ఆకాంక్షలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబంగా నిలుస్తుంది. అంటూ మోడీ పేర్కొన్నారు. మోడీ ప్రసంగంతో ప్రజలంతా ఎంతో సంతోషించారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments