Arjun Suravaram
బిడ్డను కాపాడుకోవడానికి తల్లులు చేసే సాహసం ముందు ఏది సాటి రాదు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి వెనుకడుకు వేయ్యదు. అలాంటి ఒక తల్లి ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిడ్డను కాపాడుకోవడానికి తల్లులు చేసే సాహసం ముందు ఏది సాటి రాదు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి వెనుకడుకు వేయ్యదు. అలాంటి ఒక తల్లి ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Arjun Suravaram
ఈ భూమి మీద తల్లి ప్రేమకు సాటి వచ్చేది మరొకటి లేదు. బిడ్డపై అమ్మ చూపించే ప్రేమ అనేది అనంతం. ఏ స్వార్థం లేని ప్రేమ అంటే.. అది తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు మోసి, కనీ, బిడ్డను పెంచుతుంది. బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి తల్లడిల్లిపోతుంది. బిడ్డ ప్రాణాలకు అపాయం జరిగే పరిస్థితి వస్తే.. తన ప్రాణాలను అడ్డు వేయడాని కూడా తల్లి వెనుకాడదు. అలా బిడ్డలను కాపాడే ప్రయత్నంలో మరణించిన మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. మరెందరో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా క్రూర మృగాలతో ఫైట్ చేసి.. తమ బిడ్డలను కాపాడిన అమ్మలు ఉన్నారు. తాజాగా ఓ తల్లి.. తన బిడ్డను కాపాడేందుకు చూపిన తెగువ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హ్యాట్సాప్ అమ్మ అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ఆ అమ్మ చూపిన తెగువ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో ఝరియా అనే గ్రామం దట్టమైన అడవులు మధ్య ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన కిరణ్ బైగా కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అడవుల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వన్యమృగాల భయం ఉన్నప్పటికి.. అక్కడి జీవనం వారికి అలవాటు పడింది. ముగ్గురు పిల్లలను కిరణ్ బేగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఆమె ఒక రోజు పిల్లలతో కలిసి ఇంటి దగ్గర చలి మంట కాచుకుంటుంది. ఆ సమయంలో కిరణ్ బైగా ఒడిలో పసి బిడ్డ ఉండగా.. పక్కనే మిగిలిన ఇద్దరు బిడ్డలు కూర్చుకున్నారు. అలా వారు మంటల నుంచి వస్తున్న వేడిని హాయిగా ఆస్వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ చిరుతపులి వాళ్లపై దాడి చేసింది. అంతేకాక అక్కడ ఉన్న పిల్లవాడ్ని చిరుతపులి అడవిలోకి లాక్కెళ్లి పోయింది. ఈ హఠాత్పరిణామంతో కిరణ్ బైగా భయాందోళనకు గురైంది.
బిడ్డను పులి అడవిలోకి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణం తల్లడిల్లింది. చిరుతపులి చీకట్లో ఎటు వెళ్తుందో తెలియలేదు. అయినా రాళ్లు రప్పలు, ముళ్లు ఉన్నాయనే సంగతే మరచి..బిడ్డ కోసం అడవిలోకి పరుగులు తీసింది. చాలా దూరం వెళ్లిన తరువాత పులి నోట్లో ఉన్న బిడ్డను చూసిన తల్లికి నోట మాట రాలేదు. బిడ్డను ఆ స్థితిలో చూసిన కిరణ్ బైగా మనస్సు అల్లాడిపోయింది. తన ప్రాణం పోయినా పర్వాలేదు.. బిడ్డ ప్రాణాలు కాపాడాలని నిశ్చయించుకుంది. ధైర్యం తెచ్చుకుని దాదాపు కిలో మీటర్ వరకూ చిరుత పులిని వెంబడించింది. ఈ క్రమంలోనే చిరుత ఆమెపై కూడా దాడి చేసింది. అయినా వెనక్కి తగ్గలేదు కిరణ్ బైగా.
చివరకు ఆ తల్లి చేసిన తీవ్ర ప్రయత్నం తర్వాత పులి ఆ బాబును వదిలేసి పారిపోయింది. కిరణ్ అరుపులకు స్థానికులందరూ అక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు స్థానికులు పులిని ఊరి నుంచి దూరంగా తరిమి అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి తీసుకెళ్లిన బిడ్డకు శరీరంపై స్వల్ప గాయాలయ్యాయి. చిరుతపులి దాడిలో కిరణ్ కి వీపు, చెంపలు కళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. చూశారా.. ఇలా కేవలం తల్లి మాత్రమే తన బిడ్డ కోసం ప్రాణాలను ఇచ్చేందుకు సిద్ధమవుతారు. ఇక ఆ కిరణ్ బైగా చేసిన సాహసం పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ఈ వీర వనితపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.