లివిన్ రిలేషన్ షిప్ కోసం వింత అగ్రిమెంట్.. గర్భవతి అయినా కూడా..!

పెళ్లి చేసుకొని జీవితాంతం తలనొప్పి భరించడం కన్నా.. లివింగ్ రిలేషన్ షిప్ బెటర్ అని భావిస్తున్నారు యంగ్. కానీ ఇందులో కూడా తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. కొంత మంది సరికొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ మహిళ..

పెళ్లి చేసుకొని జీవితాంతం తలనొప్పి భరించడం కన్నా.. లివింగ్ రిలేషన్ షిప్ బెటర్ అని భావిస్తున్నారు యంగ్. కానీ ఇందులో కూడా తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. కొంత మంది సరికొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ మహిళ..

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల కన్నా.. లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు యువతీ యువకులు. మూడు ముళ్ల బంధంలో గొడవలు వస్తే.. ఒక పట్టాన తేల్చుకోలేకపోవడం.. విడాకుల కోసం కొన్ని సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందన్న అపోహతో చాలా మంది పెళ్లి కన్నా సహజీవనంపై ఆసక్తి చూపుతున్నారు. లివింగ్ అయితే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేకప్ చెప్పుకోవచ్చు. మూవ్ ఆన్ అయిపోయి.. ఎవరి జీవితంలో వారు హాయిగా గడిపేయొచ్చు. అందులో ఈ కొత్త పోకడ వైపు ఇంట్రస్ట్ చూపుతున్నారు యూత్. అయితే ఇదే క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ యువతి.. తన లివింగ్ రిలేషన్ షిప్ బెడిసికొట్టడంతో ప్రియుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లెక్కింది. దీంతో ప్రియుడు అరెస్టు నుండి రక్షించుకునేందుకు రంగంలోకి దిగగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే ముంబయికి చెందిన 29 ఏళ్ల ఓ యువతి వృద్దులకు కేర్ టేకర్‌గా పని చేస్తున్నది. అయితే ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి (46)తో కొంత కాలంగా సహజీవం చేసింది. ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేశారు. కానీ పెళ్లి చేసుకోమనే సరికి అతడు నిరాకరించాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి. . అత్యాచారం చేశాడంటూ కోర్టుకు వెళ్లింది. దీంతో గతంలో తాము రిలేషన్ షిప్‌కు ముందుకు చేసుకున్న అగ్రిమెంట్ ప్రియుడు బయట పెట్టాడు. ఇప్పుడు ఈ వింత  అగ్రిమెంట్ చర్చనీయాంశమైంది. అగ్రిమెంట్ మాత్రమే కాదు.. దానికి నోటరీ చేయించారు. ఇందులో రాసుకున్న కండిషన్లు చూస్తే విస్తుపోవడం మనవంతు అవుతుంది. అందులో ఇద్దరు అంగీరిస్తూ చేసిన సంతకాలు ఉన్నాయి. వీరి మధ్య కండిషన్స్ ఎలా ఉన్నాయంటే

– 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు సహజీవనంలో కలిసి ఉండాలి.

– ఈ సమయంలో ఒకరిపై ఒకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోకూడదు. శాంతియుతంగా జీవించాలి

– సహజీవం సమయంలో మహిళ పురుషుడి ఇంటి వద్దే ఉంటుంది. ఇద్దరిలో అవతలి వ్యక్తి వైఖరి నచ్చకపోతే నెల రోజుల ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత విడిపోవచ్చు

– లివింగ్‌లో ఉన్న సమయంలో బంధువులు ఆమె ఇంటికి కాకూడదు

–  రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు పురుషుడికి స్త్రీ ఎలాంటి మానసిక వేదన కలిగించకూడదు

– ఈ మహిళ గర్భం దాల్చితే దీనికి అతడు బాధ్యత వహించడు

-ఈ సమయంలో వేధింపులు మానసిక క్షోభ కలిగించడం ద్వారా పురుషుడి జీవితాన్ని నాశనం చేస్తే ఆ బాధ్యత సదరు మహిళనే భరించాల్సి ఉంటుంది.

ఈ అగ్రిమెంట్ చూపించి.. ఆమె చేస్తున్న ఆరోపణలు తప్పని చెబుతున్నారు నిందితుడు. మా మధ్య ఇష్ట ప్రకారమే ఈ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు మోసం చేశాడంటూ కోర్టు మెట్లెక్కడం ఏంటని నిందితుడు తరఫు లాయర్ వాదించాడు. కాగా, అది తన సంతకం కాదని చెబుతుంది బాధితురాలు. వాదనలు విన్న కోర్టు చివరకు సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. ఏదేమైనా ఈ అగ్రిమెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Show comments