P Krishna
IMD Red Alert for India: దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పశువులు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.వరుసగా కురుస్తున్న వానలతో ఎన్నో గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
IMD Red Alert for India: దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పశువులు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.వరుసగా కురుస్తున్న వానలతో ఎన్నో గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
P Krishna
ఈ ఏడాది రతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దేశంలో రెండు నెలల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, బీహార్, హర్యానా, ఏపీ, తెలంగాణతో పాలు పలు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లో విస్తరించిని తీవ్ర అల్పపీడన కారణంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. గుజరాత్ నుంచి త్రిపుర వరకు, బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అల్లల్లాడిపోతున్నారు.భారీగా కురుస్తున్న వర్షాలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయని భారత వాతావరణశాఖ (ఐఎండి) హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా స్కూల్స్ కి సెలవు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పలు జిల్లాలు నీట మునిగిపోయాయి..ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా సర్ధార్ సరోవర్ డ్యామ్ నుంచి నర్మదా నదిలోకి దాదాపు 4 లక్షల క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కారణంగా భరూచ్ నగరంలోని లోతట్టు ప్రాంతాల నుంచి 280 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు రాజస్థాన్ నుండి సౌరాష్ట్ర ప్రాంతం వైపు కదులుతున్న అల్పపీడనం కారణంగా, ఆగస్టు 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని.. ఈ నేపథ్యంలోనే ఐఎండీ గుజరాత్‌ను ‘ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్’ జోన్‌గా గుర్తించింది.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు గల్లంతు కావడంతో ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (NDRF) రెస్క్యూ రంగంలోకి దగారు. భారీ వర్షాల కారణంగా తాపీ, నవ్‌సారి, సూరత్, వల్సాద్, నర్మద, పంచమహల్ జిల్లాలు భారీగా దెబ్బతిన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న కారణంగా..గుజరాత్ లోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మంగళవారం మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రపుల్ పన్షేరియా ప్రకటించారు. వర్ష ప్రభావం ఎలా ఉంటుందో దాన్ని బట్టి పాఠశాలలు పునఃప్రారంభం గురించి వెల్లడిస్తామని అన్నారు. మరోవైపు మోర్బి జిల్లా, హల్వాద్ తాలూకాలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ట్రాలీ ట్రాక్టర్‌లో ఏడుగురు గల్లంతయ్యారు.రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి గల్లంతయిన వారిని కనుగొనే పనిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా ఆగస్టు 30 వరకు గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి. గుజరాత్ తీరానికి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని బయటికి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను తనిఖీ చేయాలని వారు కోరారు.