nagidream
Google Recognized Tulu Langugae: హీరోయిన్ అనుష్క శెట్టి మాట్లాడే భాష తెలుసు కదా. తుళు భాష. ఆ భాషకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. తుళు మాట్లాడే జాతిని గూగుల్ గుర్తించింది. దీంతో తుళు జాతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
Google Recognized Tulu Langugae: హీరోయిన్ అనుష్క శెట్టి మాట్లాడే భాష తెలుసు కదా. తుళు భాష. ఆ భాషకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. తుళు మాట్లాడే జాతిని గూగుల్ గుర్తించింది. దీంతో తుళు జాతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
nagidream
ప్రపంచంలో చాలా భాషలు కనుమరుగైపోయాయి. చాలా సంస్కృతులు, మతాలు, వేషధారణ, కమ్యూనిటీలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికీ తమ ఉనికిని కాపాడుకునేందుకు కొన్ని తెగలు పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా భాషను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ప్రాంతానికి ఒక్కో భాష ఉంటుంది. ఆ భాషను కాపాడుకునేందుకు పోరాటాలు చేస్తుంటారు. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. వాటిలో తుళు భాష ఒకటి. ఇది ద్రావిడ భాషల్లో ఒకటి. ఈ భాషను ఎక్కువగా కోస్తా కర్ణాటక, ఉత్తర కేరళలో మాట్లాడతారు. మన దేశంలో 20 లక్షల మంది తుళు భాషను మాట్లాడతారు. అందులో టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఒకరు. అనుష్క తుళు జాతికి చెందిన ఆమె. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలూకా గ్రామం అయిన బెల్లిపడిలో తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించారు.
అయితే ఈ తుళు భాషను మాట్లాడేవారు ఎక్కువ మందే ఉన్నప్పటికీ తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలకు ఉన్నంత ప్రాచుర్యం ఈ భాషకు రాలేదు. అలాంటి భాషకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. గూగుల్ ఈ భాషను గుర్తించి ఆ కమ్యూనిటీకే గౌరవం తెచ్చి పెట్టింది. గూగుల్ ఎప్పటి నుంచో ఆయా ప్రాంతాల స్థానిక భాషలను ప్రోత్సహిస్తుంది. ఇంగ్లీష్ భాషను అందరి మీద రుద్దాలన్న ఉద్దేశంతో కాకుండా అన్ని భాషలు బతకాలి అనే సదుద్దేశంతో గూగుల్ ట్రాన్స్ లేటింగ్ సర్వీస్ లో చాలా భాషలను చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన 243 భాషలను గూగుల్ ట్రాన్స్ లేటింగ్ సర్వీసులో చేర్చింది. జూన్ 27న గూగుల్ 110 కొత్త భాషలను గూగుల్ ట్రాన్స్ లేట్ లో చేర్చింది. వాటితో పాటు తుళు భాష కూడా చేరింది. దీంతో తుళు కమ్యూనిటీ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఎందుకంటే తమ భాషను గుర్తించమని గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో కూడా తుళు భాషకు అధికారికంగా గుర్తింపు దక్కలేదు. ఈ కారణంగా కూడా గూగుల్ ట్రాన్స్ లేట్ లో తమ భాష చేరినందుకు ఘన విజయాన్ని సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇది తమ జాతికి దక్కిన అరుదైన గౌరవం అంటున్నారు. లక్షల మందికి ఇది చారిత్రాత్మక ఘట్టం అని అంటున్నారు. ఇప్పుడు తుళు మాట్లాడేవారు వారి భాషను వేరే భాషల్లో అనువాదం చేసుకోవచ్చు. అలానే వేరే భాష వాళ్ళు తుళు భాషలోకి అనువాదం చేసుకోవచ్చు. తుళు భాష అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం విశ్వవిద్యాలయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రొఫెసర్ వివేక రాయ్, దివంగత అమృత్ సోమేశ్వర, దివంగత కేఎస్ హరిదాసు భట్ వంటి తుళువ స్కాలర్స్.. తుళు భాషను పంచ ద్రావిడ భాషల్లో ఒకటని గుర్తించారు. పంచ ద్రావిడ భాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తుళు ఉన్నాయి.