P Krishna
Geoportal Bhuvan: మనిషి ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించారు. వాటిలో ఒకటి గూగుల్. ఒక్క స్మార్ట్ ఫోన్ అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు గూగుల్ తో ఎలాంటి సమాచారం అయినా సెకన్లలో తెలుసుకోవచ్చు.
Geoportal Bhuvan: మనిషి ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించారు. వాటిలో ఒకటి గూగుల్. ఒక్క స్మార్ట్ ఫోన్ అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు గూగుల్ తో ఎలాంటి సమాచారం అయినా సెకన్లలో తెలుసుకోవచ్చు.
P Krishna
గూగుల్ అనేది అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ సర్చ్ చేస్తే లభిస్తుంది. ఒక్క స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచం మొన చేతిలో అన్న చందంగా గూగుల్ లో ప్రతి ఒక్క సమాచారం గురించి సెకన్లలో తెలుసుకునే సదుపాయం కల్పించబడింది. ప్రతి ఒక్కరూ ఏ చిన్న సమాచారం తెలుసుకోవాలన్నా గూగుల్ సర్చింగ్ పై ఆధారపడే పరిస్తితి నెలకొంది. ఒక్కసారి గూగుల్ మోరాయిస్తే ప్రపంచం అష్టదిగ్భందం అయినట్లు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. సమాచార వ్యాప్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంలో ఇస్త్రో అద్భుతమైన విజయం సాధించింది. సామాజిక అవసరాల కోసం ఓ టూల్ రూపొందించింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సాంకేతిక రంగంలో భారత ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకు సాగుతుంది. ఇటీవల చంద్రయాన్ 3 అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలను మనవైపు తిప్పుకునే లా చేశాం. తాజాగా ఇస్ట్రో మరో అద్భత సృష్టి అందరినీ ఆకర్షిస్తుంది. సమాచార సామర్థ్యం పెంపొందించుకోవడం కోసం ఇస్రో తన జియో పర్టల్ ‘భువన్’ ద్వారా అద్భత పురోగతిని సాధిస్తుంది. సామాజిక అవసరాల కోసం భవున్ టూల్ ఏర్పాటు చేసింది. ప్రపంచ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కన్నా 10 రెట్లు అధికంగా వివరాలతో కూడిన సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల వెల్లడించారు. విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, అగ్రికల్చర్ లాంటి పలు రంగాలకు ఉపయోగపడే విలువైన సమాచారం ‘భవన్’ టూల్ అందజేస్తుందని ఆయన వెల్లడించారు.
ఈ టూల్ తో పాటుగా భువన్ – పంచాయత్, ఎన్‌డీఈఎం( నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్) అనే మరో 2 కొత్త టూల్స్ ని కూడా ప్రవేశ పెట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. మెరుగైనా అనాలిటికల్ టూల్స్, డాటా సెట్లు సరఫరా చేయడం ద్వారా స్థానిక పలనా వ్యవస్థలకు మంచి తోడ్పాటు అవుతుందనే లక్ష్యంతో భువన్ – పంచాయత్ టూల్ ని రూపొందించినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. జియో స్పెషియల్ డాటా ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ టూల్స్ ద్వారా లభిస్తుందని ఆయన వివరించారు.