Arjun Suravaram
Madhya Pradesh News: పిల్లలు చేసే పనులు చాలా సరదగా ఉంటాయి. అయితే మరికొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఓ బాలుడు తన తండ్రిని జైల్లో పెట్టండి అంకుల్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Madhya Pradesh News: పిల్లలు చేసే పనులు చాలా సరదగా ఉంటాయి. అయితే మరికొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఓ బాలుడు తన తండ్రిని జైల్లో పెట్టండి అంకుల్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Arjun Suravaram
నేటికాలంలో పిల్లలు చాలా యాక్టీవ్ గా ఉన్నారు. ఏ విషయానైనా చాలా త్వరగా గ్రహిస్తున్నారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో వారు చేసిన పనులు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొందరు బుడతలు ఏకంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసిన ఘటనలు జరిగాయి. ఇలా ఈ చిన్నారులు చేసే పనులు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. తాజాగా ఓ చిన్నోడు..తన తండ్రిని జైల్లో పెట్టమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు ఆ బుడొడ్డు చెప్పిన కారణం తెలిసి.. అక్కడి పోలీసులు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో హసనైన్ అనే ఐదేళ్ల బాలుడు తన కుటుంబం తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఒక రోజు తన తండ్రి ఇక్భాల్ పై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీస్ అధికారి ఎదురుగా కూర్చిలో కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్నాడు. దీంతో ఏం జరిగిందని పోలీసులు ఈ బుడతను ఆరా తీయగా.. తన తండ్రిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని చెప్పాడు. తన తండ్రి రోజూ కొడుతున్నాడని, ఇంటి దగ్గర ఉన్న నదిలో ఈత కొట్టేందుకు పోనివ్వడంలేదని తెలిపాడు. అంతేకాక ఆడుకోవడానికి వెళ్లొద్దనిఆ పుతున్నాడంటూ క్యూట్ మాటలతో పోలీసులకు వివరించాడు. తన ఫిర్యాదను తీసుకుని తన తండ్రి ఇక్బాల్ ను జైళ్లో పెట్టాలని కోరాడు.
ఇక ఆ బాలుడి మాటలు ఓపికగ్గా ఉన్న పోలీసులు..ఫిర్యాదుపై స్పందిస్తామని హామి ఇచ్చారు. అతన్ని తీసుకొచ్చి జైల్లో పెడతానని హామీ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ నుంచి ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి జరిగింది. ఫిర్యాదు చేయడానికి వెళ్లింది ఎవరితోనే తెలిస్తే..మీరు ఆశ్చర్యపోతారు. పోలీసులుకు ఫిర్యాదుచేసేందుకు తన తండ్రితోనే కలిసి వెళ్లాడు. ఈ సంఘటన మొత్తాని అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి తన ఫోన్ లో రికార్డ్ చేశాడు. అనంతరం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో, ఆ బుడ్డోడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. చిన్నారి ధైర్యానికి ఫిధా అయినా నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. మరి..ఈ బాలుడి వీడియోను మీరు చూసి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.