కాటేసిన పామును మెడలో వేసుకొని.. ఆస్పత్రిలో హల్ చల్!

Bihar Snake Issue: దేశంలో పాము కాటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన ఇరవై ఏళ్లలో 1.2 మిలియన్లకు పైగా పాము కాటుతో ప్రజలు చనిపోయినట్లు లెక్కలు చూపిస్తున్నాయి. ఓ వ్యక్తి పామును మెడలో వేసుకొని ఆస్పత్రిలో కలకలం సృష్టించాడు.

Bihar Snake Issue: దేశంలో పాము కాటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన ఇరవై ఏళ్లలో 1.2 మిలియన్లకు పైగా పాము కాటుతో ప్రజలు చనిపోయినట్లు లెక్కలు చూపిస్తున్నాయి. ఓ వ్యక్తి పామును మెడలో వేసుకొని ఆస్పత్రిలో కలకలం సృష్టించాడు.

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జీవాల్లో పాము ఒకటి. భారత దేశంలో పామును ఎంతగా పూజిస్తారో.. అంతకన్న ఎక్కువగా భయపతారు. మన చుట్టుపక్కల పాము ఉందన్న విషయం తెలిస్తే గజ గజ వణికిపోతారు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం పాము కాటు వల్ల చనిపోయే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. ప్రతి ఏడాది పాము కాటు వల్ల సుమారు 50 వేల మంది చనిపోతున్నట్లు ఓ అధ్యాయనంలో తేలింది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కొంతమంది రీల్స్ కోసం విషపూరితమైన పాములతో చెలగాటం ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి. ఓ వ్యక్తి విషపూరితమైన పామును మెడలో వేసుకొని హాస్పిటల్ లో హల్ చల్ చేశాడు. ఈ ఘటన బీహార్‌లో రాష్ట్రంలో భగల్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

భగల్‌పూర్ జిల్లా ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన విష సర్పాల్లో ఒకటైన రస్సెల్ వైపర్ ని తన మెడలో వేసుకొని ఆసుపత్రికి వచ్చి హల్ చల్ చేశాడు. ఆ వ్యక్తిని చూడగానే  వైద్యులు, పెషెంట్స్ షాక్ కి గురయ్యారు..భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. భగల్‌పూర్ జిల్లా మీరాచక్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మండల్ ను అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ కాటు వేసింది. పాము కాటు వేసిన వెంటనే దాన్ని చేతితో పట్టుకొని మెడలో వేసుకొని చికిత్స కోసం స్థానిక జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి చేరుకున్నాడు. అక్కడ ఎమర్జెన్సీ విభాగం వద్దకు వెళ్లి తనకు వెంటనే ట్రీట్‌మెంట్ చేయాలని వైద్యులను కోరాడు. అతని వింత ప్రవర్తన చూసిన వైద్యులు, నర్సులు, పెషెంట్స్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఎంతమంది ఆ పామును వదిలివేయాలని చెప్పినా ప్రకాశ్ మండల్ వదలకుండా దాన్ని చేత్తో పట్టుకొని కుప్పకూలిపోయాడు.  విషపూరితమైన పామును అతని వద్ద ఉండటంతో వైద్యులు ట్రీట్ మెంట్ చేసేందుకు భయపడిపోయారు. కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బంది ఆ పామును అతి కష్టం మీద బంధించారు. వెంటనే ప్రకాశ్ మండల్ కి వైద్యం అందించారు వైద్యులు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ..‘ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు, ప్రపంచంలోనే  భయంకరమైన విష సర్పాల్లో రస్సెల్ వైపర్ ఒకటి. ఆ పాము కుట్టిన వెంటనే సదరు బాధితుడు హాస్పిటల్ కి వచ్చాడు. కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ వేగంగా అతనికి చికిత్స చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు’ అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.

Show comments