ట్రాక్‌పై 10 డిటోనేటర్లతో ఆర్మీ రైలును పేల్చివేసే కుట్ర.. అంతలోనే..

Madhya Pradesh: ఈ మధ్య కాలంలో దేశ ద్రోహులు, ఉగ్రవాదులు రైళ్లను టార్గెట్ చేసుకొకి ప్రమాదాలకు కుట్ర పన్నుతున్నారు. రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు, గ్యాస్ సిలిండర్లు ఇతర వస్తువు ఇంచుతూ ప్రమాదాలు జరిగేలా చేస్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తం కావంతో ప్రమాదాలు తప్పిపోతున్నాయి.

Madhya Pradesh: ఈ మధ్య కాలంలో దేశ ద్రోహులు, ఉగ్రవాదులు రైళ్లను టార్గెట్ చేసుకొకి ప్రమాదాలకు కుట్ర పన్నుతున్నారు. రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు, గ్యాస్ సిలిండర్లు ఇతర వస్తువు ఇంచుతూ ప్రమాదాలు జరిగేలా చేస్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తం కావంతో ప్రమాదాలు తప్పిపోతున్నాయి.

శంలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు జరిగేలా కుట్రలు పన్నుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం డెహ్రూడూన్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న ట్రాక్ పై టెలికాం పాత 7 మీటర్ల ఇనుప స్తంభాన్ని ఉంచారు దుండగులు. అది గమనించిన లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. నిన్న గుజరాత్ లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలను తొలగించేందుకు ప్రయత్నించగా లైన్ మ్యాన్ గుర్తించి సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. అప్పటికే దుండగులు రైలు పట్టాలను కలిపే ఫిష్ ప్లేట్లను తొలగించడతో పాటు 40-50 బోల్ట్ లను వదలు చేశారు. ఇంజనీర్లు వచ్చి రిపేర్లు చేయడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. తాజాగా ఆర్మీ రైలును పేల్చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రపన్నారు. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లో ఆర్మీ ప్రత్యేక రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. బుర్హాన్ జిల్లా నేపానగర్ లోని సగ్‌ఫటాలో చోటు చేసుకుంది. దుండగులు సెప్టెంబర్ 18న రైల్వే ట్రాక్ లపై 10 డిటోనేటర్లను అమర్చినట్లు సమాచారం. సైన్యానికి చెందిన ప్రత్యేక రైలు జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పది డిటోనేటర్లలో ఒక డిటోనేటర్ పేలిపోవడంతో డ్రైవర్ గుర్తించి వెంటనే బ్రేకులు వేసి ట్రైన్‌ను ఆపాడున దీంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ వెంటనే స్టేషన్ మాస్టర్ కి పోన్ చేయడంతో యాంటీ టెర్రరిజీం స్క్వాడ్ (ATS), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA), రైల్వే, స్థానిక పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే.. ఉత్తర్ ప్రదేశ్ లో మరోచోట రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ గుర్తు తెలియని వ్యక్తులు ఉంచారు. దాన్ని గుర్తించిన రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే తొలగించివేశారు. నేడు ఆదివారం (సెప్టెంబర్ 22) తెల్లవారు జామున ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో ఉన్న ప్రేమ్ పూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో రైలు పట్టాలపై ఈ సిలండర్ ని గుర్తించారు. అయితే అది ఖాళీ సిలిండర్ అని అధికారులు నిర్దారించారు. ట్రాక్ పై సిండర్ ను గుర్తించిన లోకో పైలట్ సడెన్ బ్రేకులు వేసి గూడ్స్ ని అపివేయడంతో ప్రమాదం తప్పిపోయింది. ఉదయం 8:10 గంటల సమయంలో ట్రైన్ కాన్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Show comments