వీడియో: సంతోషంగా డ్యాన్స్‌ చేస్తుండగా.. ఊహించని దారుణం!

Delhi Police Head Constable: ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోయి మరణిస్తున్నారు.

Delhi Police Head Constable: ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోయి మరణిస్తున్నారు.

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ వల్ల హఠాత్తుగా చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలిపోతు హాస్పిటల్ తీసుకు వెళ్లేలోపే కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారికే గుండె పోటు వస్తుందని అనేవారు.. కానీ ఇప్పడు పరిస్థితులు మారిపోయాయి.. చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ఎక్కువ సమయం వ్యాయామం,  డ్యాన్సులు చేయడం, పెళ్లి బారాత్ లో పెద్దగా డీజే సౌండ్స్ వల్ల కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. డిల్లీలో ఓ ఫేర్ వల్ పార్టీలో పోలీస్ కానిస్టేబుల్ సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నాడు.. అంతలోనే ఊహించని దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. రూప్‌నగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న రవి కుమార్.. స్టేషన్ హౌజ్ అధికారి బదిలీ కావడంతో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రవి కుమార్ తో పాటు సహ ఉద్యోగులు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో రవి కుమార్ కి ఒక్కసారే ఛాతి నొప్పి రావడంతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. సహచరులు అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు.రవికుమార్ ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ లో ఉంటున్న రవి కుమార్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2010 లో ఢిల్లీ పోలీస్ ఫోర్స్ లో చేరాడు. 45 రోజుల క్రితమే రవి కుమార్ యాంజియోగ్రఫీ చేయించుకున్నాడు. అప్పటి వరకు తమతో ఎంతో ఆనందంగా.. సంతోషంగా గడిపిన తమ సహ ఉద్యోగి ఉన్నట్టుండి చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటి పర్యంతమైయ్యారు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల పెళ్లిళ్ళు, పుట్టిన రోజు, ఇతర శుభకార్యక్రమాల్లో ఇలాటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Show comments