సిధి ఘటన.. కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న CM

ఆదివాసి వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఎస్‌సీ/ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిధిలో ఈ ఘటన జరిగింది. ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడు ప్రవేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో బీజేపీపై ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శల వర్షం కురిపించారు.

ఇలాంటి దారుణ ఘటనలు ఇంకా జరుగుతున్నాయంటే గిరిజనులు, దళితులు ఎలాంటి దుర్భర పరిస్థితిల్లో జీవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అయింది. దీంతో ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సీరియస్‌ అయింది. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ అమానుష ఘటనలో ఇబ్బంది పడిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌ చౌహాన్‌ తన కార్యాలయానికి పిలిపించుకొని, అతని కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు. అలాగే ఆ వ్యక్తికి పూలమాల వేశారు. మరి సీఎం చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments