Arjun Suravaram
ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేసిన సంగతి అందరికి తెలిసింది. ఈ ప్రాజెక్ 2023 ఆగష్టు 23న చేపట్టగా సక్సెస్ అయింది. ఈ విజయంతో ఇస్రో తో పాటు చంద్రయాన్-3 పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. తాజాగా మరో అరుదైన ఘనత ఇస్రోకు లభించింది.
ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేసిన సంగతి అందరికి తెలిసింది. ఈ ప్రాజెక్ 2023 ఆగష్టు 23న చేపట్టగా సక్సెస్ అయింది. ఈ విజయంతో ఇస్రో తో పాటు చంద్రయాన్-3 పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. తాజాగా మరో అరుదైన ఘనత ఇస్రోకు లభించింది.
Arjun Suravaram
భారత అంతరిక్ష సంస్థ( ఇస్రో) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా.. అతి తక్కువ ఖర్చులో అంతరిక్ష ప్రయోగాలను చేస్తుంది. అంతేకాక స్పేస్ రంగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు సాధించలేని ఘనతలను ఇస్రో సాధించింది. అంతేకాక ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల కారణంగా దేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మరింత ఇనుపడింప చేసింది. ఇలాంటి సమయంలో ఇస్రో భారత్ కు మరో ఘనతను అందించింది. తాను ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్టు అంతర్జాతీయ అవార్డు లభించింది. మరి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేసిన సంగతి అందరికి తెలిసింది. ఈ ప్రాజెక్ 2023 ఆగష్టు 23న చేపట్టగా సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం వెళ్లని, సాహసం చేయని చంద్రుడి దక్షిణి ధ్రువం పపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో తో పాటు చంద్రయాన్-3 పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. తాజాగా ఈ ప్రాజెక్టు ఓ అవార్డు లభించింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3 కు ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఈ ఏడాది అక్టోబర్ 14న ప్రధానం చేయనున్నారు. ఇటలీలోని మిలాన్‌లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రానాటికల్ కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకొని ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.
గతేడాది ఇస్రో ఈ ప్రయోగం చేపట్టి…చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రమండలంపై కాలు పెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అంతేకాక ఇప్పటి వరకు ఆ మూడు దేశాలు చంద్రుడి ఉత్తర ధ్రువం వైపు మాత్రమే అడుగుపెట్టాయి. అత్యంత క్లిష్టపరిస్థితులు ఉండే దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరు ఏ దేశం అడుగు పెట్టాలేదు. అలాంటి అసాధ్యామైన ప్రదేశానికి భారత్ వెళ్లింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. రెండు వారాల పరిశోధనలు సాగించేలా వీలుగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను ఇస్రో తయారు చేసింది.
ఈ క్రమంలో విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఆ రోవర్ 100 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత ల్యాండర్, రోవర్లు స్లీప్ మోడ్‌లోకి వెళ్లాయి. ఈ క్రమంలోనే రెండు వారాల తరువాత ఆ రోవర్ ను యాక్టీవ్ చేసేందు ఇస్రో ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో అవి రెండూ శాశ్వతంగా పనిచేయడం ఆపేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ధ్రువీకరంచారు. ఏది ఏమైనప్పటికి చంద్రయాన్-3 సక్సెస్ భారత్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరితం పెంచేలా చేసింది. ఈక్రమంలోనే ఇస్రో చేసిన కృషికి ఈ అంతర్జాతీయ అవార్డు వచ్చిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.