Ration Card: రేషన్‌ కార్డుదారులకు అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త నిబంధనలు.. వారిపై కఠిన చర్యలు

రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

నెల ప్రారంభం అయ్యిందంటే చాలు అనేక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రూల్స్‌లో మార్పులు వస్తాయి.. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు, చమురు కంపెనీలు నెల ఆరంభంలో ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తుంటాయి. కొన్ని సార్లు సామాన్యులకు సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో రేషన్‌ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అలానే తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

సాధారణంగా మన దేశంలో ఆర్థికంగా వెనకబడి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డులను జారీ చేస్తున్నాయి. వీటి ద్వారా అర్హులైన పేదలకు రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పప్పు, గోధుమలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అందిస్తారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత రేషన్‌ పంపిణీతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డును తప్పనిసరి చేశారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందాలంటే.. రేషన్‌ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఏపీలో రేషన్‌కార్డుల మంజూరును నిరంతర ప్రక్రియగా మార్చింది జగన్‌ సర్కార్‌. కానీ తెలంగాణలో మాత్రం రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి అనగా.. గత పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయలేదు.

ఇదిలా ఉంటే ఇప్పటికే రేషన్‌కార్డు పొందిన వాళ్లలో చాలా మంది అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. అర్హులతో పోలిస్తే.. ఆర్థిక స్తోమత ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారే ఈ ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వ్యక్తులను పథకం నుంచి అనర్హులుగా ప్రకటించేందుకు వారి జాబితాను రూపొందిస్తోంది. ఇక అందుకే మే 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం అర్హత లేకున్నా రేషన్ తీసుకుంటున్న వారు, అక్రమంగా రేషన్ కార్డులను పొందిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. అంతే కాదు.. రేషన్ దుకాణాల్లో అక్రమంగా బియ్యం, గోధుమలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు.

ఇక తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులు లేని వారు చాలా మంది ఉన్నారు. వీరంతా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు వారి వివరాలను స్క్రుటినీ చేస్తున్నారు. దీని తర్వాత అంటే జూన్ రెండో వారంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి వివరాలను వెబ్ సైట్ లో పెట్టునున్నట్లు తెలుస్తోంది.

Show comments