విద్యార్థులకు గుడ్ న్యూస్.. CBSE చరిత్రాత్మక నిర్ణయం!

  • Author Soma Sekhar Published - 09:22 AM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Published - 09:22 AM, Sat - 22 July 23
విద్యార్థులకు గుడ్ న్యూస్.. CBSE చరిత్రాత్మక నిర్ణయం!

విద్యతోనే మనిషి జీవితంలో ఎదగగలడు. ఇక మంచిగా చదువుకుంటే.. మంచి ఉద్యోగం వస్తుందని మన తల్లిదండ్రులు చిన్నతనం నుంచే మనకు చెబుతూ ఉంటారు. ఇక పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెరగడంతో.. చాలా మంది తమ పిల్లలను ఆ స్కూల్లలోనే చదివించాలని చూస్తుంటారు. దీనితో పాటుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్ లో సీటు కోసం ప్రతి తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. అయితే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వాటిల్లో కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే విద్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతోంది. ఇక నుంచి తమకు నచ్చిన భాషలో బోధనా మాధ్యామాన్ని ఎంచుకునేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బోర్డు. ప్రీప్రైమరీ నుంచి 12 తరగతి వరకు విద్యార్థులు తమకు నచ్చిన భాషలో విద్యను చదువుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే జాతీయ విద్యా విధానం పాలసీ(NEP)ని ప్రోత్సహించడంలో భాగంగా.. సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ప్రస్తుతం మెజారిటీ సీబీఎస్ఈ స్కూల్స్ లో అత్యధికంగా ఇంగ్లీష్ లో బోధన సాగిస్తుండగా.. కొన్ని స్కూల్స్ లోనే హిందీలో పాఠాలు చెబుతున్నారు. తాజాగా బోర్డ్ తీసుకున్న నిర్ణయంతో.. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ పాఠశాలలు, వాటి అనుబంధ స్కూల్స్ లో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు తమకు నచ్చిన భాషలో విద్యను నేర్చుకోవచ్చు. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సైతం ఇలాంటి ఉత్తర్వులనే ఇచ్చింది. జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ నిర్ణయం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని భారతీయ భాషా సమితి అధ్యక్షులు చాము కృష్ణ శాస్త్రి అన్నారు. ఇక సీబీఎస్ఈ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. మరి సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: డ్రిల్లింగ్ మిషన్ తో తలకు రంధ్రం పెట్టుకున్న వ్యక్తి! కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Show comments