ఓట్లేస్తేనే మీకు నీళ్లు.. ఓటర్లను ప్రలోభపెట్టిన నేతపై కేసు నమోదు

తాగడానికి, స్నానానికి నీళ్లు లేవురా బాబు అంటే ఓటేస్తే నీళ్లు వస్తాయని అంటున్నాడో రాజకీయ నాయకుడు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన నాయకులే ఇలా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడితే ఎలా?

తాగడానికి, స్నానానికి నీళ్లు లేవురా బాబు అంటే ఓటేస్తే నీళ్లు వస్తాయని అంటున్నాడో రాజకీయ నాయకుడు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన నాయకులే ఇలా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడితే ఎలా?

బెంగళూరువాసులు ప్రస్తుతం నీళ్లు లేక ఎంతలా అలమటిస్తున్నారో తెలిసిందే. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేశారు. అయితే సాయం చేయకపోగా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు వేస్తేనే నీళ్లు ఉంటాయి మీకు అని నిస్సిగ్గుగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కీలక నేతలంతా ఓటర్ల ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.

ఈ క్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. తన తమ్ముడు సురేష్ తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన డీకే శివకుమార్.. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడ్డారు. అయితే డీకే సురేష్ తరపున అన్న డీకే శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఓ హోసింగ్ సొసైటీలో ఓటర్లను అభ్యర్ధిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. తాను ఇక్కడికి బిజినెస్ డీల్ కోసం వచ్చానని.. తన తమ్ముడు సురేష్ ని గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తానని అన్నట్లు వీడియోలో ఉంది.

కావేరీ నదీజలాలు సరఫరా చేసి అవసరమైన నీటిని కేటాయిస్తామంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. తన తమ్ముడి కోసం ఓట్లను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డీకే సురేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం.. డీకే శివకుమార్ ఎన్నికల కోడ్ ను ఉల్లఘించినట్లు ధృవీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు డీకే శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ఎన్నికల అధికారి వెల్లడించారు.

Show comments