రతన్‌ టాటా లైఫ్‌లో.. సీతారామం మూవీని మించిన లవ్‌స్టోరీ ఉందని మీకు తెలుసా?

Ratan Tata Love Story: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్ను మూశారు. ఈ విషయంలో దేశం మొత్తం దిగ్బ్రాంతికి గురయ్యింది. వ్యాపారాలను నిర్వహించడంలోను.. దానిని నైతిక విలువలతో నడిపించడంలోను ఈయన ముందుటారు. ఇంతటి మహానుభావుడి జీవితం ఆఖరి వరకు ఒంటరిగా ఉండిపోవడానికి కారణం తన ప్రియురాలు.

Ratan Tata Love Story: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్ను మూశారు. ఈ విషయంలో దేశం మొత్తం దిగ్బ్రాంతికి గురయ్యింది. వ్యాపారాలను నిర్వహించడంలోను.. దానిని నైతిక విలువలతో నడిపించడంలోను ఈయన ముందుటారు. ఇంతటి మహానుభావుడి జీవితం ఆఖరి వరకు ఒంటరిగా ఉండిపోవడానికి కారణం తన ప్రియురాలు.

మంచితనంతో అపర కుభేరుడు. ఎందరో వ్యాపారస్తులకు గురువు. మనసున్న మారాజు. ప్రేమ విఫలం అయినా కృంగిపోని ఉక్కు మనిషి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తిత్వం. సొంత లాభం కొంత మానుకుని తోటి వారికి సాయపడవోయ్ అనే మాటలకు.. ఆచరణలో అద్దం పట్టిన మహనీయుడు. జీరో హేటర్స్. పదుల సంఖ్యలో ఫ్యాక్టరీలు, కంపెనీలు. వందల అవార్డ్స్ .. వేలాది సహాయాలు.. కొన్ని కోట్ల మందికి ఆదర్శం ఈ వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు. టాటా సాల్ట్ నుంచి టాటా కార్ వరకు ప్రతి ఒక్క ఇండియన్ ఎప్పుడో ఓసారి ఆ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళమే. ఇక ఇప్పుడు రతన్ టాటా శఖం ముగిసింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్ను మూశారు. ఈ విషయంలో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి అయ్యింది. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటా ప్రవేశించని రంగం లేదు. వ్యాపారాలను నైతిక విలువలతో నిర్వహించడంలో రతన్ టాటా ముందుటారు. సక్సెస్ ఫుల్ బిజినెస్ టైకూన్ గా పేరొందిన రతన్ టాటా చివరి వరకు పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. దాని వెనుక ఆయన జీవితంలో జరిగిన ఓ అమర ప్రేమ కథ ఉంది.

ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరి మీద పుడుతుందో చెప్పలేము. ఇలా చాలా ప్రేమ కథలు మొదలవుతూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని కథలు మాత్రమే కడ వరకు కొనసాగుతాయి. మిగిలిన కథలు అర్ధాంతరంగా ఆగిపోతాయి. అలాంటి కథలలో రతన్ టాటా కథ కూడా ఒకటి. రతన్ టాటా ప్రాణానికి ప్రాణంగా ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఓ యుద్ధం వీరి ప్రేమ కథను అడ్డుకుంది. చాలా మంది సీతారామం సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో ప్రియుడు తిరిగి రాడని తెలిసినా.. తన ప్రేయసి చివరి వరకు అతని జ్ఞాపకాలతోనే ఒంటరిగా ఉండిపోతుంది. రతన్ టాటా కూడా ప్రియురాలి జ్ఞాపకాలతోనే తన జీవితాన్ని గడిపారు. మూవీలో వారిది యుద్ధంతో రాసిన ప్రేమ కథ అయితే… వీరిది యుద్ధం విడదీసిన ప్రేమ కథ. రతన్ టాటా అమెరికాలోని తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత.. లాస్ ఏంజెల్స్ లో జాబ్ దొరికింది. అక్కడే రెండేళ్లు పని చేశారు. ఆ సమయంలోనే ఆయన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అన్ని ప్రేమ జంటలలానే వారు కూడా.. ప్రేమ లోకంలో కొంతకాలం మునిగితేలారు. పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే వారి కథ కీలక మలుపు తిరిగింది.

రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ ఆరోగ్యం బాగోకపోవడంతో.. ఆయన వెంటనే ఇండియాకు రావాల్సి వచ్చింది. దానితో చాలా రోజులు రతన్ టాటా ఇండియాలోనే ఉండిపోయారు. తన కోసం తన ప్రేయసి ఇండియాకు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ అది జరగలేదు. సరిగ్గా టాటా ఇండియాకు వచ్చిన సమయంలోనే.. అంటే 1962 లో ఇండియా – చైనా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం మీద భయంతోనో.. కూతురి మీద ప్రేమతోనో తెలియదు కానీ ఆ అమ్మాయిని వారి తల్లి దండ్రులు ఇండియాకు పంపించలేదు. దీనితో వారి ప్రేమ అక్కడితో ఆగిపోయింది. ఎన్నో ఆశలతో పెళ్ళి కోసం కలలు కన్న వారి ప్రేమ.. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మరో వివాహం చేసుకుందో లేదో తెలియదు. కానీ , రతన్ టాటా జీవితంలో మాత్రం మరో అమ్మాయి రాలేదు. చివరి వరకు తన ప్రియురాలి జ్ఞాపకాలతోనే ప్రయాణం చేస్తూ వచ్చారు. మనసా వాచా కర్మణా ఒకరిని ఇష్టపడితే ఇలానే ఉంటుందేమో. ఇది చరిత్రలో నిలిచిపోయే అమర ప్రేమ కథ. ఈరోజు భౌతికంగా ఆయన అందరి మధ్యన లేకపోవచ్చు.. కానీ జీవితంలో ఎదగాలని పోరాడే ప్రతి ఒక్కరి మనసులో రతన్ టాటా బ్రతికే ఉంటారు.

Show comments