బ్రేకింగ్: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. ఐదుగురికి తీవ్ర గాయాలు!

Blast in Rameswam Cafe: ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో పేలుడు ఘటనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Blast in Rameswam Cafe: ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో పేలుడు ఘటనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల పేలుడు ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. షార్ట్ సర్క్కూట్, గ్యాస్ పేలుళ్లు సంభవించి తీవ్ర ఆస్తి నష్టం, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.  రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించి ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా చేరుకున్నారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు.  పేలుడు జరిగిన ప్రాంతంలో పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరగడంతో ఆందోళనకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సబ్బంది మోహరించారు. నిత్యం రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్ లో ఈ ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. గాయపడ్డవారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా.. మరో ఇద్దరు కస్టమర్లు గా గుర్తించారు. బెంగుళూరులో రామేశ్వరం కేఫ్ పాపులర్ జాయింట్ లో ఒకటి. ఇది షార్ట్ సర్క్యుల్ వల్లనా.. గ్యాస్ పేలడం వల్లనా.. లేదా ఏదైనా ఉగ్ర కోణం దాగి ఉందా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మారతహళ్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ కాలిపోయి ఉన్న బ్యాగు, ఐడీ కార్డులను పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహించాయి. అయితే కేఫ్ లో సిలిండర్ పేలుడు వల్లనే ఈ బ్లాస్ట్ కాలేదని.. అక్కడ బోల్ట్ లను, ఎలక్ట్రిక్ వైర్లను గుర్తించారు పోలీసులు. అనుమానాస్పద వస్తువు వల్లనే పేలుడు సంభవించి ఉండవొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ సీసీఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తి బ్యాగ్ ని అక్కడ వదిలి వెళ్లినట్లుగా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో టిఫిన్ బాక్స్ అమర్చి పేలుడికి పాల్పపడి ఉండవొచ్చని ఎన్ఐఏ ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments