P Krishna
Train Accident: ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణాలు అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. భారత దేశంలో అతిపెద్ద రైల్యే వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ఉంది. కానీ మధ్య వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Train Accident: ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణాలు అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. భారత దేశంలో అతిపెద్ద రైల్యే వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ఉంది. కానీ మధ్య వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
P Krishna
దేశంలో నిత్యం లక్షల మంది రైలులో ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణం అంటే సురక్షితం మాత్రమే కాదు అన్ని సౌకర్యాలు ఉంటాయి. సుధూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేయడానికే ఇష్టపడుతుంటారు. రైలు ప్రయాణాలు చేయడం అంటే చిన్న పిల్లలకు, పెద్దలకు ఎంతో సరదాగా ఉంటుంది. కుటుంబ సమేతంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ట్రైన్ బుక్ చేసుకోవాల్సిందే. ఇక ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్టూడెంట్స్ నిత్యం లక్షల సంఖ్యల్లో ట్రైన్ ప్రయాణం చేస్తుంటారు. ఇటీవల జరుగుతున్న రైల్ ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల రైలు ప్రయాణాలు చేయాలంటే భయంతో వణికిపోతున్నారు. సురక్షితంగా సుధూర ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాల వల్ల ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ అపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు. దర్భంగా నుంచి ఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు ఇంజన్‌తో సహా ముందుకు వెళ్లాయి. వెనుక మిగిలిన బోగీలు ఉండిపోయాయి. ఈ ఘనట కర్పూరిగ్రామ్, పుసా స్టేషన్ మద్య రెపురా గుమ్టి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినపుడు ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.. భయంతో అరిచారు. కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
వంద మీటర్లు రైలు కదిలిన తర్వాత డ్రైవర్ ఇంజన్ ఆపివేశాడు. ఎలాగో అలా ఇంజన్ ని వెనక్కి తీసుకుని మరో బోగిని చేర్చి మెల్లిగా రైలును పూసా స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే.. కోచ్ ను ఇంజన్ కు నుసంధానించే కప్లింగ్ లింక్ తెగిపోవడం వల్ల రైలు రెండు భాగాలుగా విడిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిసింది. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని కోచ్ లను అనుసంధానం చేశారు.అనుసంధానానికి సంబంధించిన పనులు పూర్తి కాగానే లింక్ ని కనెక్ట్ చేసి, బీహార్ సంపర్క్ క్రాంతిని న్యూ ఢిల్లీకి పంపారు.
🚨🚨#BREAKING : Another Day & Another Accident.
▪️The passengers traveling from Bihar Sampark Kranti Express train had very closed shave.
▪️Speeding train split into two parts.
✔️A new feather in your Cap @AshwiniVaishnaw ji.
Meanwhile, Who just said Accountability?🤔🤨 pic.twitter.com/Se8Ef2KoJ2
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 29, 2024