భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి! ఉదయం నుంచి ఎదురుకాల్పులు

Big Encounter at Chatiishgarh:ఇటీవల మావోయిస్టులకు పోలీసులకు మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు జరగడం.. అందులో పోలీసులు, మావోయిస్టులు కన్నుమూయడం జరుగుతుంది.

Big Encounter at Chatiishgarh:ఇటీవల మావోయిస్టులకు పోలీసులకు మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు జరగడం.. అందులో పోలీసులు, మావోయిస్టులు కన్నుమూయడం జరుగుతుంది.

చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తునన పోలీసులకు హఠాత్తుగా మావోయిస్టులు ఎదురు పడ్డారు. ఈ క్రమంలోనే  ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ లో డీఆర్‌జీ, సీఆర్ పీఎఫ్ 229, కోబ్రా బృందాలు పాల్గొన్నాయి. ఇరు వైపుల నుంచి జరిగిన కాల్పులు అనంతరం భద్రతా దళాలు అక్కడికి వెళ్లి పరిశీలించగా సంఘటన స్థలంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలు అక్కడ లభించినట్లు తెలుస్తుంది. వాటిని సీజ్ చేసిన పోలీస్.. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments