Swetha
Google Offer: గూగుల్ లో జాబ్ సంపాదించడం అంత తేలికైన పనైతే కాదు. దానికోసం ఎంతో ఉన్నత డిగ్రీ ఉండాలి. అది కూడా టాప్ యూనివర్సిటీస్ లో అయ్యి ఉండాలి. కానీ ఇవేమి లేకుండానే ఓ యువకుడు ఏడాదికి రూ.65 లక్షల సాలరీతో జాబ్ సంపాదించుకున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.
Google Offer: గూగుల్ లో జాబ్ సంపాదించడం అంత తేలికైన పనైతే కాదు. దానికోసం ఎంతో ఉన్నత డిగ్రీ ఉండాలి. అది కూడా టాప్ యూనివర్సిటీస్ లో అయ్యి ఉండాలి. కానీ ఇవేమి లేకుండానే ఓ యువకుడు ఏడాదికి రూ.65 లక్షల సాలరీతో జాబ్ సంపాదించుకున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.
Swetha
పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో జాబ్ సంపాదించడం అంత ఈజీ కాదు. దానికోసం మంచి పర్సెంటేజ్ ఉండాలి. ఉన్నతమైన డిగ్రీ ఉండాలి.. అది కూడా టాప్ యూనివర్సిటీలలో చదివిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ఇలాంటి క్వాలిఫికేషన్ తో లక్షల్లో వేతనాలు అందుకుంటున్నారు. అందులోను గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలో జాబ్ సంపాదించడం అంటే మరింత కష్టం. ఇన్ని అర్హతలు ఉన్నా కూడా అలాంటి కంపెనీలో జాబ్ దక్కించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే యువకుడి గురించి వింటే మాత్రం.. నక్క తోక తొక్కావ్ బ్రో.. అని అనకుండా ఉండలేరు. ఎందుకంటే అతను చదివింది టాప్ యూనివర్సిటీలోను కాదు.. ఐటీ కి సంబంధించిన డిగ్రీ కూడా కాదు. అయినా సరే ఏడాదికి రూ.65 లక్షల వేతనంతో గూగుల్ లో జాబ్ సంపాదించాడు.
పేరు ప్రఖ్యాతలు ఉన్న పెద్ద సంస్థల నుంచి వచ్చే స్టూడెంట్స్ తో పాటు .. సాధారణ కాలేజ్ నుంచి వచ్చే వారికి కూడా ఇలాంటి అవకాశం దొరకడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. బెంగుళూరుకి చెందిన కార్తీక్ జోలపారా అనే వ్యక్తి.. JP మోర్గాన్ లో డెవలపర్ గా పదేళ్లు వర్క్ చేశాడు. ఈ ఎక్స్పీరియెన్స్ తో గూగుల్ లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సెలెక్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనితో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అతను టైర్ 3 కాలేజీకి చెందిన యువకుడు. పైగా అతనికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా లేదు. దీనితో సాదా సీదా కాలేజీ విద్యార్థి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో.. మంచి ప్యాకేజ్ తో జాబ్ ఆఫర్ రావడంతో.. అందరు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆ అఫర్ లెటర్ లో ఏడాదికి రూ.65 లక్షల జీతంతో పాటు.. రూ. 9 లక్షల వార్షిక బోనస్, రూ. 19 లక్షల సిగ్నేచర్ బోనస్, రూ. 5 లక్షల రీలొకేషన్ బోనస్ ఉన్నాయి. ఇలా మొత్తం కలిపి సంవత్సరానికి రూ.1.64 కోట్లు ఆఫర్ చేసింది కంపెనీ.
ఇదే విషయాన్నీ ‘క్రేజి ఆఫర్స్’ ట్యాగ్ తో కార్తీక్ నెట్టింట షేర్ చేశాడు. దీనితో ఇప్పుడు టెకీలకు ఐటీ లో జీతాలు, ఎంపిక విధానాల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందొ తెలియనిది కాదు.. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి . కంప్యూటర్స్ టచ్ లేకుండానే ఇలాంటి ఆఫర్ రావడం గ్రేట్.. కనీసం ఆరేడేళ్ల ఎక్స్పీరియెన్స్ ఉన్న వారికే ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. ఇలా ఎవరికీ తోచినట్లు వారు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. చాలా మంది అనేక పరిస్థితుల వలన చిన్న కాలేజీల లోనే చదువు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. వారికి పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేయలేకపోతున్నామనే ఆవేదన ఉంటుంది. కానీ కార్తీక్ జోలపారా పోస్ట్ తో.. అలాంటి వారందరికీ ఓ నమ్మకం ఏర్పడింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.