Liquor Price: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మద్యం ధరలు..

Liquor Prices Decreased: మందుబాబులకు మంచి కిక్కెచ్చే వార్త ఇది. మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Liquor Prices Decreased: మందుబాబులకు మంచి కిక్కెచ్చే వార్త ఇది. మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

మద్యం.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి. క్యాన్సర్ వంటి రోగాలనైనా తగ్గించవచ్చేమో కానీ.. మందుకు అలవాటుపడ్డ వారిని మాత్రం మార్చలేము. ప్రభుత్వాలకు కూడా ఇవే ప్రధాన ఆదాయ వనరు కావడంతో.. ఏ సర్కార్ కూడా మద్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. మన సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాలకు, దారుణాలకు మద్యపానమే ప్రధాన కారణం. మద్యం మత్తులో ఎన్నో యాక్సిడెంట్లు, దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ని దారుణాలకు మూల కారణం అయిన మద్యాన్ని నియంత్రిచడం పోయి.. ధరలు తగ్గించి.. మందుబాబులను మరింత ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా ఓ సర్కార్ మద్యం ధరలను భారీగా తగ్గించింది. ఆ వివరాలు..

మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త  చెప్పింది. విదేశీ మద్యం ధరలను భారీగా తగ్గించింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 1, అనగా ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ వార్త తెలిసి మందు బాబులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే ఈ ధరల తగ్గింపు మన దగ్గర కాదు.. అస్సాంలో. విదేశీ మద్యం ధరలను భారీగా తగ్గించిన అస్సాం సర్కార్..  కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అస్సాం ఎక్సైజ్ శాఖ విదేశీ మద్యం ధరలను భారీగా తగ్గించింది. 5 శాతం ఆల్కహాల్ కలిగిన 650 ఎంఎల్ బీరు ధరపై రూ.22 తగ్గింది. 5 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న 650 ఎంఎల్ బీరు రేటును రూ.34 తగ్గించింది. సాధారణ బ్రాండ్ 750 ఎంఎల్ రమ్‌పై రూ.117 తగ్గింది. అలానే 750 ఎంఎల్ రెగ్యులర్ బ్రాండ్ విస్కీ, జింక్ రేటును రూ.144 తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అప్సాంలో  విదేశీ మద్యం ధరలను పెంచారు. అయితే ధరల పెంపు తర్వాత మద్యం ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం రేట్లను తగ్గిస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకుంది.

పాల ధర పెంపు

రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించిన అస్సాం ప్రభుత్వం.. సామాన్యులకు మాత్రం భారీ షాకిచ్చింది. పాల ధరలను పెంచింది. ఇవి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.  గువాహటి డెయిరీ ట్రేడర్స్ అసోసియేషన్(జీడీే) విలేకరుల సమావేశంలో పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పాల ధర లీటరుకు రూ.3 పెంచినట్లు గ్రేటర్ గౌహతి డెయిరీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది.

Show comments