Swetha
Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారానికి సంబంధించిన విషయాలు అందరికి తెలిసే ఉంటుంది . కొన్ని నెలల క్రితం మొదటి సర్వే ని పూర్తి చేశారు . ఇక ఇప్పుడు మరోసారి నిధిపై రెండో విడత సర్వేని ప్రారంభించారు అధికారులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారానికి సంబంధించిన విషయాలు అందరికి తెలిసే ఉంటుంది . కొన్ని నెలల క్రితం మొదటి సర్వే ని పూర్తి చేశారు . ఇక ఇప్పుడు మరోసారి నిధిపై రెండో విడత సర్వేని ప్రారంభించారు అధికారులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
కొన్ని నెలల క్రితం ఓడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోని .. నిధులకు సంబంధించి తొలి విడత సర్వే ని నిర్వహించారు అధికారులు. ఇక ఇప్పుడు ఈ భాండాగారాన్ని మరోసారి తెరిచారు. తాజాగా రెండో విడత సర్వేని ప్రారంభించారు అధికారులు. మొత్తంగా 3 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రత్న భాండాగారంలోని నిధిని వెలికి తీసే అన్వేషణ సోమవారం వరకు కొనసాగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు . ఈ సర్వేకు భక్తులంతా కూడా సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈసారి సర్వే లో ఏదైనా రహస్య గది కానీ.. సొరంగం కానీ ఉన్నాయా అనే ఎన్నో విషయాలు తెలియనున్నాయని.. రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.
పైగా ఈ సర్వే కోసం ఆధునిక రాడార్ ను ఉపయోగిస్తున్నట్లు కూడా వెల్లడించారు. సెప్టెంబర్ 18న మొదటి సర్వే నిర్వహించారు. అందులో మొత్తం 17 మంది సభ్యులు ఉండగా.. వారిలో హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐలకు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. ఇక ఆలయంలోని నిధి విషయానికొస్తే.. సుమారు 46 సంవత్సరాల తర్వాత.. జులై 14వ తేదీ మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. ఆలయంలో అత్యంత సంపద ఉన్న మూడవ గది వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి వద్ద ఉన్న మూడు తాళం చెవులతోను ఆ గది తెరుచుకోలేదు. దీనితో ఆ సమయంలో మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి అధికారులు లోపలికి వెళ్లారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ , శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయిన్, మరో 8 మంది లోపలి వెళ్లారు .
అలా లోపలి వెళ్లిన అధికారులు ఆరు టేకుతో చేసిన చెక్క పెట్టెల్లోని.. మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకుని వచ్చారు. ఇక ఆ తర్వాత మందిరంలోని రహస్య మందిరాన్ని తెరిచి లోపలికి ఎలా వెళ్లాలో పరిశీలించారు. చివరిగా మూడో గదిని 1978లో తెరిచారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 46 ఏళ్ళ తర్వాత తెరిచారు. ఆల్రెడీ 2018లో ఒడిశా హై కోర్టు ఆదేశాలతో మూడో రహస్య గదిని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ తాళాలు లేకపోవడంతో దానిని నిలిపివేశారు. ఇక 11 మంది సభ్యులు రత్న భాండాగారం తెరవడానికి వెళ్లినప్పుడు హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ మాస్కులతో లోనికి వెళ్లారు. ఆ రహస్య గదిలో పాములు ఉంటాయన్న అనుమానంతో స్నేక్ హెల్ప్ లైన్ బృదాన్ని , అత్యవసర సేవల్లో పాల్గొనే ఓడ్రాఫ్ జవాన్లను ఆలయం లోపల ఉంచారు. మరి ఈసారి ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.