వీడియో: క్రికెట్ ఆడుతుండగా ఎమ్మెల్యేకి ప్రమాదం!

ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలతో మమేకం కావడాినిక ఇష్టపడుతుంటారు. గ్రామాలు, పట్టణాల్లో సంస్కృతిక కార్యక్రమాలు, ఇతర క్రీడలు నిర్వహిస్తుంటారు.

ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలతో మమేకం కావడాినిక ఇష్టపడుతుంటారు. గ్రామాలు, పట్టణాల్లో సంస్కృతిక కార్యక్రమాలు, ఇతర క్రీడలు నిర్వహిస్తుంటారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కొంతమంది ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యకు వెళ్లి వారితో మమేకమవుతుంటారు. ప్రజలతో ఆడుతూ.. పాడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ప్రజలకు ప్రజా ప్రతినిధులపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని నమ్మకం. పీఎం నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజల్లోకి వెళ్లి వారి సంప్రదాయాలు పాటిస్తుంటారు.. క్రీడలు, నృత్యాలు చేస్తుంటారు.  తాజాగా ఓ ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్ ని ప్రారంభించారు.. కానీ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని కలహండి జిల్లా నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు. ఈ క్రీడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో యువకులు, గ్రామస్థులు ఎంతో హుషారుగా పాల్గొన్నారు. ప్రజల ఉత్సాహం చూసిన ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ చాలా సంతోషపడ్డారు. గ్రౌండ్ లో పిచ్ చూడగానే ఎమ్మెల్యే మనసు క్రికెట్ బ్యాట్ పట్టుకొని తాను కూడా ఆడాలని అనుకున్నారు.  యువతను ఉత్సాహపరిచేందుకు స్వయంగా బ్యాటింగ్ చేశారు.

ఎమ్మెల్యే భూపేంద్ర క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేయడానికి సిద్దపడ్డారు. ఓ యువకుడు బౌలింగ్ వేయగానే బ్యాట్ తో బిగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించారు.. కానీ అంతలోనే పట్టుతప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తల, ముఖం, చేతులకు గాయాలు అయ్యాయి. వెంటనే ఆయను సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. రాజకీయ నేతలు మైకులతో అలరించాలి.. బ్యాట్ తో అలరించాలని చూస్తే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారని అంటున్నారు.

Show comments