అహ్మదాబాద్ మహిళను వేధించిన జొమాటో డెలివరీ ఏజెంట్ శ్వేతాంగ్ జోషి

Are You Order Food At Midnight Then Know This Incident: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే ఏ సమయంలో అయినా ఇంటికి వచ్చేస్తుండడంతో చాలా మంది రాత్రి, పగలూ తేడా లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో బయటకెళ్లే పని లేకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే మీరు అర్ధరాత్రి వేళ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఈమెకు జరిగినట్టే మీకూ జరగొచ్చు.

Are You Order Food At Midnight Then Know This Incident: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే ఏ సమయంలో అయినా ఇంటికి వచ్చేస్తుండడంతో చాలా మంది రాత్రి, పగలూ తేడా లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో బయటకెళ్లే పని లేకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే మీరు అర్ధరాత్రి వేళ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఈమెకు జరిగినట్టే మీకూ జరగొచ్చు.

జొమాటో డెలివరీ ఏజెంట్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఒక మహిళ ముందుకొచ్చింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కాఫీ ఆర్డర్ చేసినప్పుడు ఈ ఘటన జరిగిందని.. ఆ అహ్మదాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆమె తెలిపింది. ఈ కారణంగా తాను ఆర్డర్ చేసిన కాఫీ డెలివరీ ఆలస్యం అవుతుందని.. పరిస్థితిని అర్థం చేసుకున్నా అని రాసుకొచ్చింది. అయితే డెలివరీ పార్టనర్ ఆలస్యం అయినందుకు పదే పదే నవ్వు ఎమోజీతో సారీ చెబుతున్నాడని.. అది నాకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె తెలిపింది. మతిస్థిమితం లేని వాడేమో అని సీరియస్ గా తీసుకోలేదని ఆమె పోస్ట్ లో రాసుకొచ్చింది.

శ్వేతాంగ్ జోషి అనే డెలివరీ ఏజెంట్ తన పాదాన్ని చూపిస్తూ తనకి తగిలిన గాయాన్ని చూపిస్తూ వచ్చాడని ఆమె పేర్కొంది. ఆమె స్మార్ట్ ఫోన్ లోని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి అతని పాదం మీద వేయబోతే ఆమెకు ఆ డెలివరీ ఏజెంట్ జననాంగం కనిపించిందని ఆమె ఆరోపించింది. ఆ డెలివరీ ఏజెంట్ తనను చూసి నవ్వుతూ.. వెక్కిరిస్తూ ‘మేడం ప్లీజ్ సహాయం చేయండి’ అని అడిగాడని ఆ మహిళా కస్టమర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. అయితే ఆమె వెంటనే జరిగిన ఘటన గురించి జొమాటో కంపెనీకి ఫిర్యాదు చేశానని.. కానీ కంపెనీ ప్రతిస్పందన తనను మరింత బాధించిందని ఆమె వెల్లడించింది. జొమాటో కంపెనీ కస్టమర్ కేర్ అమ్మాయి కాల్ లో మాట్లాడుతూ.. ఇరువురి వాదనలు వింటామని తెలిపిందని కస్టమర్ రాసుకొచ్చింది.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎవరైనా జొమాటో కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇబ్బందులు పడాలని అనుకుంటారా? రీఫండ్ కోసమో? మరేదో దాని కోసమో కాల్ చేయరు కదా.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.. కానీ ఒక మహిళ అయినందుకు.. తదుపరి నోటీసు వచ్చే వరకూ ఎదురుచూడమని అనడం అర్థం లేనిది.. అసహ్యకరమైనది’ అంటూ ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి తనకు కంపెనీ నుంచి ఎలాంటి కాల్ చేయలేదని.. దీంతో అత్యవసర సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయడం ఎంత ప్రమాదమో అర్థమవుతుంది అంటూ ఆమె రాసుకొచ్చింది. కస్టమర్స్ కి సురక్షితమైన డెలివరీ చేస్తామని చెప్పుకోవడం సిగ్గు చేటు అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.

తనలానే చాలా మంది మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండి ఉండవచ్చు.. పైకి చెప్పుకోలేకపోవచ్చునని ఆమె వెల్లడించింది. అయితే ఈ ఘటన జరిగిన చాలా సేపటి తర్వాత జొమాటో నుంచి తనకు కాల్ వచ్చిందని.. జరిగిన దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఆమె వెల్లడించింది. తనను ఇబ్బంది పెట్టిన డెలివరీ పార్టనర్ ని జొమాటో తొలగించిందని.. అతని లైసెన్స్ ని కూడా రద్దు చేసిందని ఆమె చెప్పుకొచ్చింది. అయినప్పటికీ జొమాటోలో అత్యవసర సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయడం సురక్షితం కాదని ఆమె భావిస్తుంది. అయితే జొమాటో చేయగలిగింది చేసిందని ఆమె పేర్కొంది.

Show comments