Yatra 2: ‘నాకు భయపడ్డం రాదు!’.. గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్న యాత్ర 2 టీజర్‌!

Yatra 2 Teaser: యాత్ర సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కింది. యాత్రలో వైఎస్సార్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితం గురించి చెప్పిన దర్శకుడు.. యాత్ర 2లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం గురించి చెప్పనున్నారు.

Yatra 2 Teaser: యాత్ర సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కింది. యాత్రలో వైఎస్సార్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితం గురించి చెప్పిన దర్శకుడు.. యాత్ర 2లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం గురించి చెప్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా ‘యాత్ర 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2019లో విడుదలైన యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కుతోంది. యాత్రలో దర్శకుడు మహి వీ రాఘవ వైఎస్సార్‌ రాజకీయ జీవితాన్ని కళ్లకు గట్టారు. పాదయాత్ర, సంచలన విజయాలను తెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు యాత్ర 2 ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని తెరపై చూపించనున్నారు.

యాత్ర 2.. 2024 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌గా ప్రముఖ తమిళ హీరో జీవా నటిస్తున్నారు.  వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత చోటుచేసుకున్న సంఘటనలతో పాటు.. ప్రజా సంకల్ప యాత్ర.. 2019 ఎన్నికల్లో సంచలన విజయాలే ప్రధాన ఇతివృత్తంగా సినిమా ఉండనుంది. యాత్ర 2నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా సినిమానుంచి ఓ టీజర్‌ విడుదలైంది.

యాత్ర 2 టీజర్‌ ఎలా ఉందంటే.. 

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితం ఓ బ్లాక్‌ బాస్టర్‌ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. సాధారణంగా నిజ జీవిత కథల్ని తెరకెక్కించడానికి దర్శకులు చాలా మార్పులు చేస్తూ ఉంటారు. కానీ, వైఎస్‌ జగన్‌ కథ మాత్రం ప్రతీ సంఘటన ఎలా పెట్టుకున్నా అద్భుతంగా ఉంటుంది. వైఎస్‌ జగన్‌ ఒంటరిగా రోడ్డుపై ఓ అంధుడితో మాట్లాడటంతో టీజర్‌ మొదలవుతుంది. అప్పటినుంచి మొదలైన డైలాగుల పరంపర చివరి వరకు కొనసాగుతుంది. ఎమోషన్స్‌ ఎక్కడా మిస్‌ అవ్వలేదు.

వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా ఒదిగిపోయారు. జగన్‌ హావభావాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. టీజర్‌ చివర్లో వచ్చే ‘‘ నాకు భయపడ్డం రాదయ్యా.. నేనేంటో నా రాజకీయం ఏంటో.. నీకింకా అర్థం కాకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొడుకును’’ అన్న వైఎస్‌ జగన్‌ డైలాగ్‌.. ‘‘ నా రాజకీయ ప్రత్యర్థినైనా.. శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ.. మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా!’’ అన్న వైఎస్సార్‌ డైలాగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మరి, యాత్ర 2 టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments