ఈ చిన్నారి దక్షిణాది స్టార్ హీరోయిన్.. తాజాగా మంచి హిట్టు కూడా కొట్టేసింది..

అమ్మ చేతిలో ముద్దులొలికిస్తున్న ఈ చిన్నారి దక్షిణాది ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అయితే ఆమె వ్యక్తిగతంగా, వృత్తి పరంగా స్ట్రగుల్స్ ఎదుర్కొంది. అయినప్పటికీ బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ నటీమణిగా కొనసాగుతోంది.

అమ్మ చేతిలో ముద్దులొలికిస్తున్న ఈ చిన్నారి దక్షిణాది ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అయితే ఆమె వ్యక్తిగతంగా, వృత్తి పరంగా స్ట్రగుల్స్ ఎదుర్కొంది. అయినప్పటికీ బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ నటీమణిగా కొనసాగుతోంది.

జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా అనే మాట ఈ ఫోటోలోని చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. అమ్మ చేతిలో ముద్దులొలుకుతోన్న ఈ పాప  స్టార్ హీరోయిన్. దక్షిణాది ఇండస్ట్రీలో ఊపిరాడకుండా సినిమాలు చేసింది. మంచి హిట్స్ అదుకుంది. దిగ్గజ నటులతో యాక్ట్ చేసింది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. వీటికి తోడు ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. జీవితం, కెరీర్ నేర్పిన పాఠాలను ఛాలెంజింగ్‌గా తీసుకుని బౌన్స్ బ్యాక్ అయ్యింది. వరుస సినిమాలతో, సక్సెస్‌తో అదరగొడుతుంది. కేవలం నటి మాత్రమే కాదు.. సింగర్, ప్రొడ్యూసర్. తెలుగులో కన్నా ఆ ఇండస్ట్రీలోనే ఎక్కువ హవా సాగిస్తుంది. ఇంత ఎలివేషన్ ఇచ్చిన ఈ బ్యూటీ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామని ఆసక్తిగా అనిపిస్తుంది కదా.

ఆమె ఎవరో కాదు.. మమతా మోహన్ దాస్. మలయాళ పేరెంట్స్‌కు బహ్రెయిన్‌లో పుట్టింది. బెంగళూరులో డిగ్రీ చదివిన ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగపెట్టింది. అలాగే కర్ణాటిక్, హిందూస్తానీ సంగీతాన్ని నేర్చుకుంది. 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమా ప్లాప్. ఆ తర్వాత సురేష్ గోపీ, మమ్మట్టి మూవీలో నటించింది. 2007లో తెలుగు నాట ఎంట్రీ ఇచ్చింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మూవీ యమదొంగలో ధనలక్ష్మీ పాత్రలో మెప్పించింది. ఆలీ, మమతా మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తుంటాయి. ఆ తర్వాత కృష్ణార్జునలో యాక్ట్ చేసింది. విక్టరీ, కథానాయకుడు తర్వాత వరుసగ మూడు చిత్రాలు తెలుగులో చేసింది.  ఇటు సినిమాలు చేస్తూనే సాంగ్స్ పాడింది. హోమమ్, చింతకాలయ రవి, కింగ్ చేసింది. మళ్లీ నాగార్జునతో కేడీలో జతకట్టింది.

అయితే ఆ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. వరుసగా మలయాళ సినిమాల్లోనే నటించింది. 2011లో బిజినెస్ మ్యాన్ ప్రజీత్‌ను మనువాడింది. కానీ పట్టుమని ఈ సంసారం సంవత్సరం కూడా సాగలేదు. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు మహమ్మారి క్యాన్సర్ తో పోరాడింది. ఆ సమయంలో కాస్త తక్కువ సినిమాలే చేసింది. మళ్లీ 2017 నుండి పుంజుకుంది ఈ బ్యూటీ. వరుసగా సినిమాలను లైన్లో పెట్టింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయ్యింది. 2021లో ఎనిమీ మూవీతో పలకరించింది. అది తెలుగులో కూడా డబ్ అయిన సంగతి విదితమే. ఇవే కాకుండా ఫోరెన్సిక్, జనగన మణ వంటి డబ్బింగ్ మూవీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్‌లో ఉంది. సుమారు 12 ఏళ్ల తర్వాత రుద్రాంగి మూవీతో టీటౌన్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విజయ్ సేతుపతి 50వ మూవీ మహారాజలో నటించింది.  ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది.

Show comments