జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం గురించి అశ్వనీదత్ నోటీసు ఎందుకు ఇచ్చినట్టు?

గత వారంలో ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ చలసాని విడుదల చేసిన నోటీసు గట్టి దుమారమే లేపింది. సోషల్ మీడియా హోరెత్తిపోయింది ఆ నోటీసు మీద కథనాలతో.

గత వారంలో ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ చలసాని విడుదల చేసిన నోటీసు గట్టి దుమారమే లేపింది. సోషల్ మీడియా హోరెత్తిపోయింది ఆ నోటీసు మీద కథనాలతో.

గత వారంలో ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ చలసాని విడుదల చేసిన నోటీసు గట్టి దుమారమే లేపింది. సోషల్ మీడియా హోరెత్తిపోయింది ఆ నోటీసు మీద కథనాలతో. ఇంతకీ ఏమిటా నోటీసు? త్వరలో మెగాస్టార్ చిరంజీవితో బింబిసార ఫేం వశిష్ట చేయబోతున్న భారీ ఫాంటసీ చిత్రం ప్రారంభం కాబోతున్నట్టుగా వార్తలు రావడం, ఆ చిత్రం మీద భారీ అంచనాలు చెలరేగడం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే వచ్చింది పేచీ. ఈ కథకి అశ్వనీదత్ మెగాస్టార్ కాంబోలో వచ్చిన మైల్ స్టోన్ చిత్రం కథకు సంబంధించిన కొన్ని అంశాలో, కొన్ని ఛాయలో వశిష్ట చిత్రంలో ఉన్నట్టుగా ఊసులు మొదలయ్యాయి.

నిజానికి జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏ విధమైన ఫాంటసీ చిత్రం ఛేయలేదు. కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చి, కల్ట్ చిత్రంగా పేరుపడ్డ అంజి చిత్రం కూడా ఫాంటసీ చిత్రమే అయినా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలా బ్లాక్ బస్టర్ చిత్రమూ కాదు, అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్న అవకాశమూ అంజి చిత్రానికి లభించలేదు. కాబట్టి,ఈ దుమారంలో అంజి చోటు దక్కించుకోలేకపోయింది. కానీ, వశిష్ట చేసిన కథ దాదాపుగా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రకథను అనుకుని తయారైందనే టాక్ మాత్రం చాలా పెద్ద స్థాయిలోనే చక్కర్లు కొట్టడంతో అందరి నిఘా ఈ కథమీద కాస్తంత ఎక్కువ మోతాదులోనే పడింది.

పైగా, బోళాశంకర్ చిత్రం డిజాస్టర్ కావడంతో అటూఇటుగా ఉన్న అత్తెసరు కథలను మెగాస్టార్ చాలా స్ట్రిక్ట్గ్ గానే పక్కన పెట్టేశారు. అందులో ముఖ్యంగా కళ్యాణ క్రిష్ణ కథ ప్రధానమైంది. కానీ వశిష్ట కథని మాత్రం చిరంజీవి అక్కున చేర్చుకుని ముందుకు తీసుకువచ్చారు. ఫాంటసీ కథ, అందులో అన్నీ అంశాలు పక్కాగా కుదిరాయి, అందుకే చిరంజీవి ఆ కథకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సెట్స్ వైపుకి తీసుకెళ్తున్నారన్న నిజం అశ్వనీదత్ లో కొంత కలవరం రేపి ఉంటుందన్నది ముమ్మాటికి నిజం. పైగా, అశ్వనీదత్ కి మాత్రమే తెలిసిన నిజం….జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రకథా చర్చల్లో మెగాస్టార్ కూడా క్రియాశీలకంగా పాలు పంచుకున్నారు, తనదైన ఆలోచనలను, ఐటమ్స్ ని ఆ కథలో ఇతోధికంగా పంచిపెట్టారు.

ఇటువంటి వాస్తవాలు వ్యక్తిగతంగా తెలిసిన అశ్వనీదత్ కంగారు పడి, ఇటువంటి నోటీసుకు ముందుకొచ్చారు అని పరిశ్రమలో పెద్దలు కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయనంత స్పష్టంగా, నిర్దిష్టంగా నోటీసును బహిర్గతం చేయడం కూడా జరిగిందన్నది అందరూ నమ్ముతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి కథపైన జీవితకాలపు హక్కులు సర్వం తనవేనని, వాటిని ఎవరు ఏ విధంగా ముట్టుకోవాలని ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన బిగ్గరగానే హెచ్చరించారు. అశ్వనీదత్ జారీ చేసిన నోటీసు అంతరార్థం ఏమైనా కూడా అది ముఖ్యంగా మెగాఅబిమానులలో ఆగ్రహానికి ఆజ్యం పోసింది.

వారి కోపం కట్టలు తెంచుకుంది. యూట్యూబ్ వేదికగా అశ్వనీదత్ మీద విరుచుకుపడుతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి భారీ స్ఘాయి విజయాన్ని తమ హీరో అందిస్తే, దాని పుణ్యమా అని తర్వాతి రోజులలో చూడాలని ఉంది, ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్స్ కోసం మెగాస్టార్ ఔదార్యంతో డేట్స్ ఇచ్చి సహకరిస్తే, ఇప్పుడు ఉందో లేదో, ఔనో కాదో తెలియని అంశాలపైన కయ్యానికి కాలు దువ్వినట్టుగా ముందస్తుగా అశ్వనీదత్ నోటీసులతో తమ హీరో గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నది మెగాఅబిమానుల కోపానికి కారణమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఇందులో మరో నిజం కూడా దాగి ఉందన్నది కూడా ఒప్పుకోవాలి. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్నది ఏనాటినుంచో అశ్వనీదత్ కలలు కంటున్న మాట అయితే క్షేత్రస్థాయి వాస్తవం.

దీనిక సంబంధించి కథలో వేటలో కూడా ఆయన చాలా కాలంగా నిమగ్నమై ఉన్నారన్నది కూడా అంతే నిజం. కాకపోతే మహానటి ముందు కొన్ని సంవత్సరాల పాటు అశ్వనీదత్ సరైన విజయాన్ని అందుకోలేకపోవడం, వైఫల్యాల ఊభిలో కూరుకుపోవడం, అదేకాలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయరంగంలో పడి, పరిశ్రమకు అందకపోవడ వంటి అనేక కారణాల వల్ల జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ నిర్మించాలన్న అశ్వనీదత్ ఆశయం కేవలం ఊహగా మాత్రమే మిగిలిపోయింది. మళ్ళీ మహానటి చిత్రంతో విజయాల వెల్లువలోకి అడుగుపెట్టిన అశ్వనీదత్ సీక్వెల్ నిర్మాణంపైన తదేకంగా ధ్యాస పెట్టారని యూనిట్ సభ్యలు చెబుతున్నారు.

అన్నీ సజావుగా కుదిరితే రామ్ చరణ్ మెయిన్ లీడ్ గా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ నిర్మించాలని అశ్వనీదత్ ఆలోచిస్తున్నట్టుగా ఆయన సన్నిహిత నిర్మాత ఒకరు చెప్పుకొచ్చారు. కానీ అశ్వనీదత్ ప్రస్తుతం వందల కోట్ల వ్యయంతో ప్రభాస్ హీరోగా దీపికా పడుకోనే హీరోయిన్ గా, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ వంటి భారతీయ సినీ దిగ్గజాలతో కల్కి చిత్రం నిర్మాణంలో తలమునకలై ఉన్నారన్న సంగతి అందిరికీ తెలిసిన మాటే. ఏ భారీ చిత్రమైనా, ఏ భారీ చిత్రమైన కల్కి చిత్రం తర్వాతే గానీ అంతకు ముందుండే ఆస్కారమే లేదు. కాబట్టి, ఈ కారణాల నేపథ్యంలో అశ్వనీ దత్ తన తదుపరి చిత్రం కోసం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రకథ పట్ల కొంత జాగత్త పడి ఉంటారన్నది కొందరి విశ్లేషణ. సమీక్ష.                                                      

Show comments