Raghuvaran Son Pics: విలన్ రఘువరన్ తనయుడిని చూశారా? అచ్చం హీరోలా..

Raghuvaran Son Pics: విలన్ రఘువరన్ తనయుడిని చూశారా? అచ్చం హీరోలా..

80's , 90's లో అనేక విభిన్నమైన క్యారెక్టర్స్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన ఎంతో మంది నటి నటులు.. ఇప్పుడు అనేక కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ నటుడి తనయుడి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అచ్చం తండ్రిని పోలిని ఆ తనయుడు ఎవరో చూసేద్దాం.

80's , 90's లో అనేక విభిన్నమైన క్యారెక్టర్స్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన ఎంతో మంది నటి నటులు.. ఇప్పుడు అనేక కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ నటుడి తనయుడి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అచ్చం తండ్రిని పోలిని ఆ తనయుడు ఎవరో చూసేద్దాం.

రఘువరన్.. ఈ పేరు వినగానే అతను చేసిన విలన్ క్యారెక్టర్స్ అందరికి గుర్తొస్తూ ఉంటాయి. 80’s , 90’s లో అనేక విభిన్నమైన క్యారెక్టర్స్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేమస్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ విలక్షణ నటుడు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది బడా హీరోలకు సరి సమానంగా నటిస్తూ.. గట్టి పోటీనే ఇచ్చాడు రఘువరన్. తండ్రిగా, అన్నగా, విలన్ హా ఇలా దాదాపు 200 కు పైగానే సినిమాలలో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు. నటుడు ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్న క్రమంలోనే.. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా 2008 లో అకస్మాత్తుగా మరణించారు. ఇక ఇప్పుడు అచ్చం తండ్రిని పోలిని రఘువరన్ తనయుడు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1996లో నటి రోహిణి మొల్లేటితో రఘువరన్ వివాహం జరిగింది. వీరికి 1998 ఓ కుమారుడు కూడా జన్మించాడు. అంతా సాఫీగానే సాగిపోతుంది అనుకునే క్రమంలో.. వారిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2004 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడిపోయిన తరవాత వారి కుమారుడు తన తల్లితోనే ఉన్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వీరికి సంబంధించిన విషయాలు ఏమి బయటకు రాలేదు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది సెలెబ్రెటీలకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో.. ఇప్పడు రఘువరన్ తనయుడు ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రఘువరన్ తనయుడి పేరు రిషి వరణ్. ప్రస్తుతం రిషి హైట్ లోను, స్టైల్ లోను.. అచ్చం తన తండ్రిలానే కనిపించడంతో.. తండ్రిలానే ఉన్నాడంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రిషి విషయానికొస్తే.. ఇతను కూడా తల్లిదండ్రులు లానే ఇండస్ట్రీ వైపే అడుగులు వేస్తున్నాడు. అతనికి సంగీతం ఆసక్తి ఉండడంతో ఇప్పటికే పలు ఇంగ్లీష్ ఆల్బమ్స్ ను రిలీజ్ చేశాడు. వాటిలో ఫాదర్ సన్ బారిన్ అనే ఆల్బమ్ బాగా హిట్ అయింది. అయితే మొదట్లో రఘువరన్ కు కూడా సంగీతం అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ తర్వాతే సినిమాలలోకి వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు రిషి కూడా ఇలానే ఉండడంతో.. ఇతను కూడా త్వరలో సినిమాలలోకి అరంగేట్రం చేయబోతున్నాడా అనే సందేహాలు అందరికి మొదలయ్యాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments