Venkateswarlu
విజయ్‌కాంత్ నటుడి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తమిళనాడులోని తెలుగు కుటుంబంలో పుట్టారు. తమిళ చిత్ర పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలారు.
విజయ్‌కాంత్ నటుడి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తమిళనాడులోని తెలుగు కుటుంబంలో పుట్టారు. తమిళ చిత్ర పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలారు.
Venkateswarlu
తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మరణవార్తతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన వారు కూడా విజయ్‌కాంత్ మరణంపై స్పందిస్తున్నారు. కన్నీటి పర్యంత అవుతున్నారు.
విశాల్ ఏకంగా ఏడుస్తున్న వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘‘ కెప్టెన్ విజయ్‌కాంత్ అన్న చనిపోయాడని తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. ఈ సమయంలో నేను మీ పక్కన ఉండాలి. మీ పక్కన ఉండి. మీ కాళ్లు మొక్కాలి. కానీ, నేను వేరే దేశంలో ఉన్నాను. నన్ను క్షమించండి. రాలేకపోతున్నాను. మీ మంచి తనం గురించి చాలా మంది చెప్పారు. మీ ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టి పంపే వారు. మీరు ఈ సమాజానికి చాలా సేవలు చేశారు.
ఓ మంచి మనిషి చనిపోయాడన్నదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’’ అని అన్నారు. విజయ్‌కాంత్ మంచి తనం గురించి విశాల్‌కు మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తానికి బాగా తెలుసు. కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తున్న సమయంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. చెన్నైలో కూడా చాలా మరణాలు సంభవించాయి. అయితే, కరోనా కారణంగా మరణించిన వారి అంత్యక్రియలు జరపటానికి స్థలం దొరక్క చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ హీరో చేయని పని చేశారు. తన సొంత కాలేజీ గ్రౌండ్‌లోని కొంత భాగాన్ని కరోనా కారణంగా మరణించిన వారి అంత్యక్రియల కోసం ఇచ్చేశారు. అయితే, కరోనా సమయంలో ఇంత పెద్ద మనసు చాటుకున్న ఆయన ఇప్పుడు కరోనా కారణంగానే చనిపోయారు. కాగా, విజయ్‌కాంత్ హీరోగా ఒకప్పుడు కమల్ హాసన్, విజయ్‌కాంత్‌లకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన సినిమాలు చాలా తెలుగులో డబ్ అయి రిలీజయ్యాయి.
అంతేకాదు! విజయ్‌కాంత్ పోలీసు పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆయన తీసిన రమణ తెలుగులో ‘ ఠాగూర్’గా రీమేక్ అయింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరి, కరోనా సమయంలో మృతుల అంత్యక్రియల కోసం నాడు స్థలం కేటాయించిన విజయ్‌కాంత్ అనుకోని విధంగా కరోనాకు బలికావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
கொரோனாவால் உயிரிழந்தவர்களின் உடல்களை அடக்கம் செய்ய பொதுமக்கள் எதிர்ப்பு தெரிவித்தால், ஆண்டாள் அழகர் பொறியியல் கல்லூரியின் ஒரு பகுதியை உடல் அடக்கம் செய்ய எடுத்துகொள்ளலாம்.#SpreadHumanity | #COVID19 pic.twitter.com/CG2VLBzj4F
— Vijayakant (@iVijayakant) April 20, 2020