P Krishna
Vijay Kanth : కోలీవుడ్ హీరో విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. మాస్ డైలాగ్స్, ఫైట్స్ తో ఆయన అభిమానులను కట్టి పడేసేవారు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే డీఎండీకే పార్టీని స్థాపించారు.
Vijay Kanth : కోలీవుడ్ హీరో విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. మాస్ డైలాగ్స్, ఫైట్స్ తో ఆయన అభిమానులను కట్టి పడేసేవారు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే డీఎండీకే పార్టీని స్థాపించారు.
P Krishna
ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సోషల్ మీడియాలో ఇదుగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో కాస్త ఉత్సాహం ఎక్కువే. విజయ్ కాంత్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని, పరిస్థితి పూర్తిగా విషమించి చనిపోయే పరిస్థికి వచ్చిందిన వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. అసలు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటీ.. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ మాస్ హీరో విజయ్ కాంత్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు వస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి ప్రేమలత చూసుకుంటున్నారు. ఇటీవల ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే విజయ్ కాంత్ పై సోషల్ మీడియాలో రక రకాలుగా పుకార్లు పుట్టుకు వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి పై కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆస్పత్రికి తరలి వెళ్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అయితే విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి ప్రేమలత సోషల్ మీడియాలలో ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
డీఎండీకే వ్యవస్థిపకులు, నటులు విజయ్ కాంత్ తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించారు. మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పార్టీ స్థాపించి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు విజయ్ కాంత్. ఆయన కొంతకాలంగా డయాబెటీస్ తో పాటు లివర్ కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 18న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలోని మియాట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితి పై రక రకాల పుకార్లు పుట్టుకువచ్చాయి. పుకార్లపై ఆయన సతీమణి ప్రేమలత స్పందిస్తూ.. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకు వస్తాయో అర్ధం కాదని.. దయచేసి వాటిని నమ్మొద్దు అని కార్యక్తలకు, అభిమానులకు విజయ్ కాంత్ తో దిగిన సెల్ఫీ ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.