Arjun Suravaram
Vicky Kaushal: తరచూ కొందరు సెలబ్రీటలకు బెదిరింపుల అనేవి ఎదురవుతుంటాయి. అలానే వారు తమకు ఎదురైన చేదు అనుభవాలు గురించి షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా ఓ స్టార్ హీరో కూడా తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించారు
Vicky Kaushal: తరచూ కొందరు సెలబ్రీటలకు బెదిరింపుల అనేవి ఎదురవుతుంటాయి. అలానే వారు తమకు ఎదురైన చేదు అనుభవాలు గురించి షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా ఓ స్టార్ హీరో కూడా తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించారు
Arjun Suravaram
సమాజంలో మనుషులపై బెదిరింపులు అనేవి జరుగుతూనే ఉంటాయి. వివిధ కారణాలతో కొందరి నుంచి హెచ్చరికలు అనేవి వస్తుంటాయి. ముఖ్యంగా మనం చేసే వృతిలో గిట్టని వారు బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఇలా కేవలం సామాన్యులకే కాక సెలబ్రిటీలకు, ప్రముఖలకు కూడా వస్తుంటాయి. తరచూ కొందరు సినీ ప్రముఖులు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలు, బెదిరింపుల వంటి ఘటన గురించి షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా ఓ ప్రముఖ హీరో కూడా తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించాడు. మరి.. ఆ హీరో ఎవరు, ఆయనకు వచ్చిన బెదరింపులు ఏమిటి, ఇప్పుడు చూద్దాం…
విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో హాయిగా జీవిస్తున్నారు. అలానే ప్రస్తుతం వారిద్దరు వివిధ సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే..విక్కీ కౌశల్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ న్యూస్. త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్ కీలక పాత్రలు పోషించారు. ఆనంద్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంత చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
బ్యాడ్ న్యూస్ మూవీ విజయం సాధించిన సందర్భంగా విక్కీ ఓ ఇంటర్వూల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన బెదిరింపుల గురించి వెల్లడించాడు. తాను అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపారు. ఇసుక మాఫియా ముఠా తన బృందంపై దాడికి యత్నించిందని తెలిపాడు. ఓసారి తాను పోలీసుల నుంచి కూడా తప్పించుకున్నానని చెప్పాడు. ఇంకా విక్కీ మాట్లాడుతూ…బాలీవుడ్ దర్శకడు అనురాగ్ కశ్యప్ వద్ద తాను సహాయ దర్శకుడిగా పనిచేశాని తెలిపాడు. ఆయన తెరకెక్కించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కోసం అసిస్టెంట్ డైరెక్ట్ గా వర్క్ చేశానని, ఆ సినిమాలో బొగ్గు స్మగ్లింగ్ సన్నివేశాలు నిజంగా షూట్ చేసినవని తెలిపాడు.
ఇసుక అక్రమ తవ్వకాలను షూట్ కోసం వెళ్లినప్పుడు తనకు జరిగిన చేదు అనుభవం గురించి వివరారించాడు. అక్కడ ఎలాంటి భయం లేకుండా బహిరంగంగానే కొంతమంది ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే విషయాన్ని తొలిసారి గ్రహించాని తెలిపాడు. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని రహస్యంగా షూట్ చేస్తున్నప్పుడు దాదాపు 500 మంది తమ టీమ్ వద్దకు వచ్చి చుట్టుముట్టారని తెలిపాడు ఆ ముఠాకు చెందిన ఒక వ్యక్తి మా కెమెరామెన్‌ను కొట్టి, అతడి చేతిలోని కెమెరా లాక్కున్నాడని, తమపై దాడి చేయబోతుంటే అక్కడి నుంచి పారిపోయామని విక్కీ తెలిపాడు.
అదే విధంగా మరో సందర్భంలో పోలీసులు మమ్మల్ని పట్టుకోబోయారని తెలిపాడు. బెనారస్ స్టేషన్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీపై సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు, కారులో కెమెరా పెట్టి సీక్రెట్‌గా షూట్ చేస్తున్నామని తెలిపాడు. అది గ్రహించిన పోలీసులు విక్కీ టీమ్ ను పట్టుకునే ప్రయత్నం చేయడం తాము పారిపోయినట్లు విక్కీ కౌశల్ తెలిపారు. మరి..విక్కీ కౌశల్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.