సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

ఈ మద్య సినీ పరిశ్రమలో వరుసగా జరుగుతున్న విషాద ఘటనలు అభిమానులను కలవరపెడుతున్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. వయోభారం, అనారోగ్యం, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తమిళనాట ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్. శంకర్ కన్నుమూసిన ఘటన మరువక ముందే మరో సీనియర్ కమెడియన్ కన్నుమూయడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

అస్సాం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, స్టార్ కమెడియన్ జయంత్ దాస్ (54) శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు. గౌహతిలోని అపోలో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌహతికి చెందిన పులిన్ చంద్ర దాస్, తమల్ కు కుసుమ్ దాస్ దంపతులకు జూన్ 8, 1969 న జన్మించారు. చిన్నతనంలో చదువుల్లో ఎంతో చలాకీగా ఉండే జయంత్ దాస్ ని నటుడు, రచయిత అమూల్య కాకతీ నటన వైపు దృష్టి మల్లించారు. ఆయన కోరిక మేరకు జయంత దాస్ చిన్నతనంలోనే నాటకాలు వేస్తూ అందరిచే శబాష్ అనిపించుకున్నారు. లతాసిల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన కాటన్ కాలేజ్ లో డిగ్రీ పొందారు.

కెరీర్ బిగినింగ్ లో ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించినారు. 2012-2019 నుంచి జయంత్ దాస్ అస్సామీ కామెడీ సీరియల్ ‘సిట్ కామ్ భారఘర్’ లో హేమంత కాకోటీ పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యారు. పలు సీరియల్స్‌లో నటించిన జయంత్ దాస్ తర్వాత ‘పులక్ గొగోయ్’ మూవీతో వెండితెరపై అడుగు పెట్టి తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తనదైన హాస్యంతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణంతో అస్సామీ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ సెలబ్రెటీలు ఆయనకు నివాళులర్పించారు.

Show comments