Varalakshmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్.. వాళ్లందరికి ఓపెన్ వార్నింగ్!

ఇప్పుడు ఈ నటి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలలో తన నటనతో, తన వాయిస్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఈ నటి తనపై వచ్చిన కామెంట్స్ పైన మండిపడింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు ఈ నటి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలలో తన నటనతో, తన వాయిస్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఈ నటి తనపై వచ్చిన కామెంట్స్ పైన మండిపడింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీఓ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలియని వారు ఎవరు లేరు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడు గురించే టాక్ వినిపిస్తుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనుకోని విధంగా మంచి విల్లన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు తమిళం అనే తేడా లేకుండా ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషిస్తూ అందరిని అలరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. సినిమాలలో తన పాత్రలు ఎంత ముక్కుసూటిగా ఉంటాయో.. నిజ జీవితంలోను ఆమె అదే విధంగా.తనపై వచ్చిన ర్యూమర్స్ కు సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఇటీవల ఆమెపై, ఆమె ఫ్యామిలీ పైన వచ్చిన నెగెటివ్ కామెంట్స్ పైన మండిపడింది వరలక్ష్మి శరత్ కుమార్.

ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అయితే వరలక్ష్మి తండ్రికి రెండు వివాహాలు జరిగాయి. మధ్యలో ఏవో కొన్ని మనస్పర్థలు వచ్చినా కానీ. ఇప్పుడు మాత్రం ఈ రెండు కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. వరలక్ష్మి కు సంబంధించిన ఫంక్షన్ వేడుకలలోను ఈ రెండు కుటుంబాలు కలిసి ఎంతో సంతోషంగా గడిపాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోస్ లో ఆమె కుటుంబ సభ్యుల ఫొటోస్ కూడా ఉన్నాయి. దీనితో కొంతమంది నెటిజన్లు ఆమెపైన, ఆమె కుటుంబం పైన నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీనితో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ నెగెటివ్ కామెంట్స్ పైన స్పందిస్తూ.. కాస్త సీరియస్ అయింది. దీనితో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. “నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని మాట్లాడటం కంటే.. మీరెందుకు చేయడం లేదని ఆలోచించండి. ప్రపంచంలో నటీనటులకు చాలా తక్కువగా పారితోషికం ఉంటుంది. అది కూడా కేవలం షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే అతడు ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొన్నాడో మీకు తెలుసా ?.. సెలబ్రెటీలు ఎప్పుడూ సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటారని అంటారు.. కానీ ఎవరికీ అలాంటి పరిస్థితి ఉండదు. పారితోషికం ఒక్కసారే వస్తుంది. షూటింగ్ ఆగిపోతే రాదు. మా పని అంత సులభం కాదు” అంటూ మండిపడింది. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇటువంటి వాదోపవాదనలు చాలా కామన్ అయిపోయాయని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments