పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘వదినమ్మ’ సీరియల్ నటి!

  • Author ajaykrishna Published - 02:57 PM, Sat - 23 September 23
  • Author ajaykrishna Published - 02:57 PM, Sat - 23 September 23
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘వదినమ్మ’ సీరియల్ నటి!

సినీ సెలబ్రిటీలే కాదు.. సీరియల్ సెలబ్రిటీలు సైతం సర్ప్రైజింగ్ అప్డేట్స్ ఇవ్వడంలో ఏమాత్రం తక్కువ కాదని చెప్పాలి. రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు అటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ లైఫ్ కి సంబంధించి అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటారు. సోషల్ మీడియా అనగానే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ మాత్రమే కాదు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అభిమానులు, ఫాలోయర్స్ కి అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పి హ్యాపీ చేసింది. కానీ.. ఆమె భర్త సీరియల్ నటుడు ఏకంగా వీడియో పెట్టి సర్ప్రైజ్ చేయడం విశేషం.

ఇంతకీ ఆ నటి ఎవరంటే.. ప్రియాంక నాయుడు. వదినమ్మ సీరియల్ లో సిరి అనే క్యారెక్టర్ పోషిస్తుంది ప్రియాంక. ఇక ఆమె భర్త మధు బాబు. ఇతను కూడా సీరియల్ ఆర్టిస్టే. జీ తెలుగులో ప్రసారమైన మంగమ్మ గారి మనవడు సీరియల్ తో బుల్లితెరపై జర్నీ స్టార్ట్ చేసిన మధు.. ఆ తర్వాత అక్కాచెల్లెల్లు, అభిషేకం సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. కట్ చేస్తే.. నటి ప్రియాంక నాయుడుతో లవ్.. ఇద్దరు కొన్నాళ్ళపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లితో సర్ప్రైజ్ చేసిన ఏ జంట.. తాజాగా తాము తల్లిదండ్రులు అయ్యామంటూ ఎమోషనల్ అయిపోయారు.

ఇక తాజాగా ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరు ఈ ఆనందకరమైన విషయాన్నీ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. పైగా పుట్టింది బాబునా లేక పాపనా? మీరే చెప్పాలంటూ ఓ వీడియో కూడా పోస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక మధుల వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులు అయినందుకు అటు ఫ్యాన్స్ ఫాలోయర్స్ నుండి.. ఇటు ఇండస్ట్రీ వర్గాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రియాంక నాయుడు, మధుల జంట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments