Swetha
Latest Released Movies Update :పెద్ద సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే.. ఒక్కోసారి ఏ అంచనాలు లేకుండా థియేటర్లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు కూడా మంచి బజ్ దక్కించుకుంటాయి. ఈ క్రమంలో తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా మూవీస్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటున్నాయో చూసేద్దాం.
Latest Released Movies Update :పెద్ద సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే.. ఒక్కోసారి ఏ అంచనాలు లేకుండా థియేటర్లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు కూడా మంచి బజ్ దక్కించుకుంటాయి. ఈ క్రమంలో తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా మూవీస్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటున్నాయో చూసేద్దాం.
Swetha
మూవీ లవర్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. క్యాస్టింగ్ సంగతి పక్కన పెట్టేస్తే.. కథను బట్టి ప్రేక్షకులు ఆయా సినిమాలను హిట్ చేస్తూ చేస్తూ ఉంటారు. స్టార్ క్యాస్టింగ్ , భారీ బడ్జెట్ తో రూపొందించే సినిమాలకు ఎలాగూ ముందు నుంచే విపరీతమైన బజ్ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాల గురించి పక్కన పెట్టేస్తే.. ఒక్కోసారి ఏ అంచనాలు లేకుండా థియేటర్లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు కూడా మంచి బజ్ దక్కించుకుంటాయి. ఈ క్రమంలో ఆగష్టు 2 న థియేటర్ లో మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దాం.
రాజ్ తరుణ్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత వారం రిలీజ్ అయినా పురుషోత్తముడు మూవీ బాక్స్ ఆఫీస్ ముందు డిజాస్టర్ గా నిలిచింది. కనీసం ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కు హిట్ తెచ్చిపెడుతుంది అనుకుంటే.. ఈ మూవీ కూడా రాజ్ తరుణ్ కు నిరాశే మిగిల్చింది. కొత్త కాన్సెప్ట్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు.. ఈ మూవీ ఆల్రెడీ చూసిన కథల అనిపించడంతో.. అంతగా మెప్పించలేకపోయింది. మరి లాంగ్ రన్ లో ఏ మేరకు కొనసాగుతుందో చూడాలి.
కొంతకాలం పాటు సరైన కథలు లేక సినిమాలకు దూరంగా ఉన్న అల్లు శిరీష్.. టెడ్డి బేర్ కాన్సెప్ట్ తో బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మూవీ రిలీజ్ కు ముందే టికెట్ ధరలు తగ్గించడంతో.. సోషల్ మీడియాలో బడ్డీ మూవీ బజ్ బాగానే నడించింది. ట్రైలర్ కూడా బాగానే ఉందనిపించింది. ఇక థియేటర్స్ లో కూడా ప్రస్తుతానికి ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ అయితే ఏమి లేదు.. ఫ్యామిలీ కలిసి చూసేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. మరి లాంగ్ రన్ లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందనేది చూడాలి.
చిలుకూరి ఆకాశ్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించిన సినిమా అలనాటి రామచంద్రుడు. ఈ సినిమా రిలీజ్ కు ముందు అయితే అంతగా బజ్ వినిపించలేదు. ఇక స్టోరీ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో చిన్నపటినుంచి ఒక ఇంట్రోవర్ట్. ఈ క్రమంలో అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. వీరిద్దరి ప్రేమ ఎలా కొనసాగింది? వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే కథ. కథలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోవడంతో.. ఈ సినిమా గురించి కూడా ఎలాంటి పాజిటివ్ టాక్ వినిపించడంలేదు.
ఈ వారం రిలీజ్ అయినా సినిమాలలో కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న సినిమా ఇదే. హీరో అశ్విన్ బాబు తక్కువ సినిమాలు చేసినా కూడా కచ్చితంగా అందులో ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండి తీరుతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. అబ్దుల్ అప్సర్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. ఆగష్టు 1న థియేటర్ లో అడుగుపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలించిందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే శివం భజే మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో కొనసాగుతుంది.
మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.